TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎల్లలు దాటిన ప్రేమ కథలు

Published on: Tue Jul 25, 2023 1:53PM

బాలివుడ్ లో ఇండియా పాక్ క్రాస్ బార్డర్ లవ్ స్టోరీలు కోకొల్లలు. అలాంటి సినిమాలు ఇప్పటి వరకు 12 వచ్చాయి.హీనా (1991), షహీద్ ఏ మహబ్బత్ సింగ్ (1999), రిఫ్యూజీ (2000), గదర్ (2001), దిల్ పర్ దేశీ హోగయా(2003), వీర్ (2004), ఏక్ తా టైగర్ (  2012), టోటల్ సియప్ప(2014) అలాంటివే. 
ఇండియా, పాకిస్థాన్ శత్రుదేశాలు. అయినప్పటికీ ఇరు దేశ పౌరుల మధ్య జరుగుతున్న లవ్ స్టోరీలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఫేస్ బుక్ పరిచయాలు పరిణయాలకు దారి తీస్తున్నాయి.   కొన్ని రోజుల క్రితం పాకిస్థాన్ కు చెందిన సీమా హైదర్ ఇళ్లు వదిలేసి ప్రియుడిని వెతుక్కుంటూ ఇండియా వచ్చేసింది. నలుగురు పిల్లల తల్లి అయిన సీమా హైదర్ పాకిస్థాన్ మహిళ అక్రమంగా ఇండియా ప్రవేశించింది. గ్రేటర్ నోయిడాలో ఉన్న ప్రియుడిని వెతుక్కుంటూ నేపాల్ మార్గంలో ఇండియా ప్రవేశించి ప్రియుడిని కల్సుకుంది.  ఎట్ట కేలకు యుపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ వార్త ఇరు దేశాల్లో సంచలన వార్తగా మారింది. మళ్లీ ఇప్పుడు ఇండియాకు చెందిన అంజు పాకిస్థాన్ కు చెందిన నస్రుల్లాను వెతుక్కుంటూ పాకిస్థాన్ వెళ్లిపోయింది. రాజస్థాన్ కు చెందిన వ్యక్తితో వివాహమైంది. అంజుకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాకిస్థాన్ కు చెందిన నస్రుల్లాతో సోషల్ మీడియాలో పరిచయమైన అంజు ప్రేమలో పడింది. నస్రుల్లాను వెతుక్కుంటూ పాకిస్థాన్ వెళ్లిపోయింది. పాకిస్థాన్, భారత పౌరుల మధ్య ప్రేమలు కొత్తేం కాదు. చాలా కాలంగా ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చోటు చేసుకున్న ప్రేమ కథలు ఆసక్తికరంగా మారాయి.