కోటీశ్వరుడు టూ బిచ్చగాడు..!!

మీరు బిచ్చగాడు సినిమా చూసే ఉంటారు.. ఆ సినిమాలో హీరో తన తల్లి ఆరోగ్యం కోసం కొన్ని రోజులపాటు బిచ్చగాడి అవతారం ఎత్తుతాడు.. ఆ సినిమాలో లాగానే చెన్నైలో ఓ కోటీశ్వరుడు బిచ్చగాడి అవతారం ఎత్తాడు.. కానీ అతను సినిమాలో హీరోలాగా తల్లి ఆరోగ్యం కోసం బిచ్చగాడిలా మారలేదు.. కోడలితో గొడవ కారణంగా బిచ్చగాడిలా మారాడు.

 

 

అసలు స్టోరీ ఏంటంటే.. చెన్నైకి చెందిన నటరాజన్ ఒక కోటీశ్వరుడు.. అతనికి భార్య మరియు ముగ్గురు కుమారులు ఉన్నారు.. కొన్ని నెలల క్రితం నటరాజన్ కు అతని కోడలికి మధ్య గొడవ జరిగింది.. ఆ గొడవలో కుటుంబసభ్యులు కోడలికే సపోర్ట్ చేసారు.. ఇంటి యజమానిగా తనని ఎవరూ పట్టించుకోవట్లేదని మనస్థాపానికి గురైన నటరాజన్ భార్య, పిల్లల మీద అలిగి ఇంటినుండి వెళ్ళిపోయాడు.. కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతని ఆచూకీ తెలియలేదు.. ఇంతకీ అతను ఏం అయ్యాడో తెల్సా.. ఓ గుడి దగ్గర ప్రసాదాలు తింటూ బిచ్చగాడిలా బ్రతుకుతున్నాడు.. కుటుంబసభ్యులు ఒక రోజు అనుకోకుండా ఆ గుడికి వెళ్లి.. అక్కడ బిచ్చగాడిగా బ్రతుకుతున్న నటరాజన్ ని చూసి షాక్ అయ్యారు.. క్షమాపణలు చెప్పి కారులో ఇంటికి తీసుకెళ్లారు.. ఆస్తి అంతస్తులు ఎన్నున్నా గౌరవ మర్యాదలు లేని చోట ఉండలేం అనడానికి నటరాజన్ కథే ఉదాహరణ.