పంట రుణాల మాఫీకి ప్రభుత్వం కృషి
Published on: Mon Aug 11, 2014 6:29AM
.jpg)
పంట రుణాల మాఫీకి ప్రభుత్వం కృషి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పంట రుణాల మాఫీ కోసం తెర వెనుక ముమ్ముర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వివిధ ఆదాయ మార్గాల ద్వారా రూ.10, 000 కోట్లు మిగిల్చి దీనికోసం పక్కన పెట్టిన ప్రభుత్వం, మరో 28000 కోట్ల అప్పు కోసం వివిధ ఆర్ధిక సంస్థలు, రెండు బ్యాంకులతో చర్చిస్తున్నట్లు తాజా సమాచారం. ఒకటి రెండు నెలల్లో ఈ మొత్తం సమకూరే అవకాశమున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఇక రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు ససేమిరా అంటున్న ఆర్.బీ.ఐ. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా మరియు నెల్లోఒరు జిల్లాలలో రైతులు తీసుకొన్న రూ.5,000 కోట్ల పంట రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు అంగీకరిస్తూ ప్రభుత్వానికి ఒక లేఖ వ్రాసింది. గనుక అన్నీ అనుకొన్నట్లు సవ్యంగా సాగినట్లయితే త్వరలోనే రుణాల మాఫీ వ్యవహారం ఒక కొలిక్కి రావచ్చును.


