TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐ లవ్యూ అమ్మా...

Published on: Sat Apr 4, 2015 1:18PM

 

తల్లి ప్రేమ ముందు ఎలాంటి ప్రేమా సరితూగదు అంటారు. ఓ తల్లి తన కూతురి ప్రాణాలు కాపాడుకోవడానికి మొసలితో పోరాడింది. ఈ ఘటన గుజరాత్ లోని వడోదరా పడ్రా పట్టణం సమీపంలోని తికారియంబరక్ గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం కాంతా వాకార్ అనే యువతి ఎప్పటిలాగే బట్టలు ఉతకడానికి విశ్వామిత్ర నదికి వెళ్లింది. ఇంతలో ఒక ముసలి అమాంతంగా వచ్చి కాంతా వాకార్ కాలు పట్టుకొని నదిలోకి లాగింది. దీంతో అక్కడే ఉన్న కాంతా వాకార్ తల్లి దీపాలి వెంటనే స్పందించి బట్టలు ఉతికే కర్రతో మొసలి తలమీద బలంగా ఓ 10 నిమిషాల పాటు కొట్టింది. దాంతో మొసలి కాంతా వాకార్ కాలు వదిలి నీటిలోకి జారిపోయింది. గాయపడిన తన కుమార్తెను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించింది. విశ్వామిత్ర నదిలో దాదాపు 260 మొసళ్లు ఉన్నాయని, నదిలో పరివాహక ప్రాంతంలో బట్టలు ఉతకవద్దని గ్రామస్తులకు అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.