ఆంధ్ర ప్రదేశ్ లో 4 చోట్ల క్రిటికల్ కేర్ ఆస్పత్రులు: జగన్ మోహన్ రెడ్డి 

"ఇలాంటి వైరస్ లు వందేళ్లకు ఒక సారి వస్తాయని, ఆ సందర్భాలు మనకు వస్తాయని కూడా ఎప్పుడూ అనుకోలేదు. కొన్ని నిర్ణయాలు సరైన సమయం లో తీసుకోవలసిందే. కఠిన నిర్ణయాలైనా అవి అందరూ పాటించాల్సిందే. మన వాళ్ళని, తెలంగాణా నుంచి మన రాష్ట్రం లోకి అనుమతించకపోవటం బాధ కలిగించింది. ఏప్రిల్ 14 దాకా మనం ఎక్కడి వాళ్ళం అక్కడే ఉండిపోతే, ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ పెద్ద కష్ట తరమైన విషయం కాకుండా ఉంటుంది. రాష్ట్ర సరిహద్దుల వద్దకు వస్తున్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.....దయచేసి ఈ మూడు వారాల పటు జాగ్రత్త గా ఉండి పొమ్మని కోరుతున్నా... పొందుగల, సాగర్ చెక్ పోస్ట్, దాచేపల్లి వద్ద కూడా ఈ రోజు ఇదే పరిస్థితి ఎదురైంది.. తెలంగాణా సరిహద్దుల వైపు నుంచి వచ్చినా కూడా, తప్పనిసరిగా 14 రోజులు స్వీయ నిర్బంధం లో ఉండాల్సిందే. కేవలం ఈ మూడు వారాలు ఎక్కడి వారు అక్కడే ఉండి పొమ్మని కోరుతున్నా. తెలంగాణా ముఖ్యమంత్రి కె సి ఆర్ చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ, ఆంద్ర ప్రజలకు తోడుగా, నీడగా ఉంటానని హామీ ఇచ్చారు. మన రాష్ట్రంలో ఇప్పటికే పది కేసులు పాజిటివ్ గా తేలాయి. ఇప్పటి వరకూ 27, 819 మంది విదేశాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చారు ఇటీవల కాలంలో. వారందరినీ కూడా సర్వీలెన్స్ లో ఉంచాంఆంధ్ర ప్రదేశ్ లో 4 చోట్ల క్రిటికల్ కేర్ ఆస్పత్రులు ఏర్పాటు చేసాం " -ఇదీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీడియా తో మాట్లాడిన అంశాలు.