TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏసుదయ: తెలంగాణవాదులకు కేసీఆర్ భరోసా

Published on: Sun Dec 25, 2011 11:17AM

హైదరాబాద్: వచ్చే క్రిస్మస్ వేడుకలు తెలంగాణలోనే జరుపుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు  తెలంగాణవాదులకు భరోసా ఇచ్చారు.తెలంగాణ భవన్‌‌లో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏసుప్రభు దయవల్ల తెలంగాణ రాష్ట్రం తప్పక వస్తుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమన్నారు. దళిత క్రైస్తవుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయన్నారు. దళిత క్రైస్తవుల పట్ల చూపే వివక్షపై కేంద్రానికి త్వరలో లేఖ రాస్తానని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్‌మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలో ప్రముఖ చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఏసు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చిలను శోభాయమానంగా అలంకరించారు.