అవిశ్వాస గండం: క్షణం క్షణం మారుతున్న రాజకీయాలు

 

 Parliament live, Crisis for UPA, no confidence motion, SP to support no confidence motion

 

 

ఢిల్లీలో క్షణం,క్షణం రాజకీయాలు మారుతున్నాయి. కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాలక పక్షంపై అదే పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రతినిధులు అవిశ్వాస తీర్మానం పెట్టిన అరుదైన ఘటన అధిష్టాన వర్గాన్ని ఇరకాటంలోకి నెట్టింది. ఇప్పుడు దీనిపైన రాజకీయ వర్గాలలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.


టిడిపి, కాంగ్రెస్, వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ మీరా కుమార్ పరిగణంలోకి తీసుకున్నారు. సీమాంధ్ర ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పెరిగె సూచనలు కనిపిస్తున్నాయి. అవిశ్వాసానికి మద్దతు ఇచ్చే అంశంపై బిజెపి నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. దీనిపై కాసేపట్లో ప్రకటన చేయనున్నారు.

            

ఈ రోజు లోక్ సభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అంటూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను స్పీకర్ 12 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభ కూడా వాయిదా పడింది.