TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐపీఎల్ క్రికెటర్ శశాంక్ సింగ్ పై క్రిమినల్ కేసు!

Published on: Tue Jun 30, 2026 9:54AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున మెరుపు ఇన్నింగ్ లతో ఆకట్టుకున్న క్రికెటర్  శశాంక్ సింగ్ పై క్రిమినల్ కేసు నమోదైంది.  శశాంక్ సింగ్ తో పాటు ఆయన తండ్రి  రిటైర్డ్  ఐపీఎస్ అధికారి అయిన ఆయన తండ్రి శైలేష్ సింగ్ పై కూడా కేసు నమోదైంది. ఇంతకీ జరిగిందేంటంటే.. వారిద్దరూ కలిసి తమ ఇంట్లో వంటపని చేసే వ్యక్తిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.   బాధితుడి ఫిర్యాదు మేరకు భోపాల్    రాతిబాద్ పోలీస్ స్టేషన్‌లో  వీరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.  

బాధితుడు విపేంద్ర సింగ్ తోమర్  ఫిర్యాదు  మేరకు వివరాలిలా ఉన్నాయి.     విపేంద్ర సింగ్‌కు ఇటీవలే ఒక పరిచయస్తుడి ద్వారా భోపాల్‌లోని నిల్బాద్ ప్రాంతంలో నివసిస్తున్న  రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్ బంగ్లాలో వంట మనిషిగా చేరాడు. నెలకు రూ. 15 వేల జీతంతో పాటు ఉచిత వసతి, భోజనం కల్పిస్తామని యజమానులు ఒప్పందం చేసుకున్నారు. అంతేకాకుండా..  భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించడానికి కూడా తమ వంతు సహాయం చేస్తామని నమ్మబలికారు.  

పనిలో చేరిన కేవలం   గంటల వ్యవధిలోనే బంగ్లాలో అతడికి వేధింపులు మొదలయ్యాయి. వంట బాగాలేదంటూ తండ్రీ కొడుకులు  శశాంక్సింగ్, శైలేష్ సింగ్ లు అతడిపై మానసిక ఒత్తిడి తీసుకువచ్చారు.    అసభ్య పదజాలంతో దూషించడం ప్రారంభించారు. ఈ  వేధింపులను తట్టుకోలేని  విపేంద్ర సింగ్..  తాను  ఉద్యోగం మానేసి  స్వగ్రామానికి తిరిగి వెళ్లిపోతానని వారికి చెప్పాడు. దీంతో    శశాంక్ సింగ్ ,  ఆయన తండ్రి శైలేష్ సింగ్ లు అతడితో  గొడవపడి, అతని మొబైల్ పోన్ లాక్కొని కొట్టడానికి రావడంతో అతడు  ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అయినా వదలని తండ్రీ కొడుకులు..   తమ వ్యక్తిగత డ్రైవర్‌తో కలిసి ఆ గది తలుపులను బలవంతంగా బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి విపేంద్ర సింగ్‌పై విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న విపేంద్రసింగ్ నేరుగా.. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.  పోలీసులు వెంటనే అతనికి ప్రభుత్వ ఆసుపత్రిలో   వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో  విపేంద్ర సింగ్ ముఖం, శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు  నిర్ధారించారు. మెడికల్ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు   ఐపీఎల్ క్రికెటర్ శశాంక్ సింగ్, అతడి తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి  శైలేష్ సింగ్,  వారి డ్రైవర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి  దర్యాప్తును ప్రారంభించారు.