TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒలింపిక్స్ లో క్రికెట్!

Published on: Thu Apr 10, 2025 12:47PM

విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ లో మళ్లీ క్రికెట్ సందడి చేయనుంది. దాదాపు  128 ఏళ్ల తరువాత క్రికెట్ కు మళ్లీ ఒలింపిక్స్ లో స్థానం లభించనుంది. ఒలింపిక్స్ లో చివరి సారిగా 1900లో క్రికెట్ ఆడారు. అయితే ఆ తరువాత నుంచి ఒలింపిక్స్ కు క్రికెట్ దూరమైంది. ఇప్పుడు మళ్లీ క్రికెట్ ను ఒలింపిక్స్ క్రీడల జాబితాలో చేర్చడానికి నిర్ణయం తీసుకున్నది. ఒలింపిక్స్ అసోసియేషన్.

2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చడానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే టెస్ట్, వన్డే ఫార్మట్లలో కాకుండా టీ20 ఫార్మట్ లో క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేర్చాలని నిర్ణయించారు. పురుషులు, మహిళల జట్లకు అవకాశం ఇచ్చారు.  అత్యంత జనాదరణ ఉన్న క్రికెట్ కు ఒలింపిక్స్ లో స్థానం కల్పించడం కచ్చితంగా క్రికెట్ అభిమానులకు ఎంతో సంతోషం కలిగిస్తుంది.  2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ చేరిక ఒలింపిక్స్ కు మరింత ఆదరణ పెరగడానికి దోహదం చేస్తుందని క్రీడా పండితులు అంటున్నారు.