TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉప్పల్ స్టేడియంలో రచ్చ రచ్చ!

Published on: Thu Aug 23, 2012 5:14PM

 cricket match, uppal stadium, online ticketing, online   booking,uppal stadium, agitation, hartaal, dharna, cricket   lovers, jimkhana ground, police action, lathi charge, no   response,no entryఅనుకున్నంతా అయ్యింది. బోల్డు రూపాయలు పోసి కొనుక్కున్న టిక్కెట్లు నిరుపయోగమైపోయాయ్. ఆన్ లైన్ లో టిక్కెట్లు కొనుక్కున్న అభిమానుల్ని పోలీసులు స్టేడియంలోకి అనుమతించలేదు.. సరికదా జింఖానాకు వెళ్లండంటూ ఆదేశాలు జారీ చేశారు. డబ్బుపోసి టిక్కెట్లు కొనుక్కుని కష్టాలు కోరి తెచ్చుకున్నట్టైందని కొందరు లెంపలేసుకుని ఇంటిదారి పడితే.. బాధను బైటపెట్టుకోలేకుండా ఉండలేని కొందరు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియంముందు ఆందోళనకు దిగారు. పోలీసులు వాళ్లని అక్కడ్నుంచి తరిమేసేదాకా ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. అరిచీ అరిచీ అలసిపోయిన అభిమానులుకూడా చేసేదేంలేక చివరికి ఇంటిదారి పట్టారు. డబ్బుపోయి శని పట్టడమంటే ఇదేనేమో..