పాక్ చేతిలో ఇండియా ఓడితే… బెట్టింగ్ బాబులకు లాసెంతో తెలుసా?

 

ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఎవరికి టెన్షన్ గా వుండదు? అందరికీ టెన్షనే! అందరూ అటెన్షనే! కాని, మనందరికంటే డబుల్ , త్రిబుల్ టెన్షన్ లో వుండేది ఎవరో తెలుసా? బెట్టింగ్ బాబులు! ప్రపంచంలో ఏమైనా బెట్టింగ్ కాసే ముఠాలు ఇప్పుడు బోలెడు వున్నాయి. ఎన్నికలు వచ్చిన, మ్యాచ్ లు వచ్చినా ఈ పందెంగాళ్లకు పండగే పండుగ! ఇంతకు ఇంతా, అంతకు ఇంతా… అంటూ వందలు, వేలు ఖర్చు చేస్తుంటారు! కాని, గత పదేళ్లలో ఎప్పుడూ రాని విధంగా ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా, పాక్ ఫైనల్స్ కు వచ్చాయి. మరి దీని ఎఫెక్ట్ బెట్టింగ్ బాబుల మీద ఎలా వుండబోతోంది? ఖచ్చితంగా అరాచకం వందలు, వేలల్లో వుండదు. కోట్లు, వందల కోట్లు, వేల కోట్లలో వుంటుందట పందెం పండుగ!

 

ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే అది యుద్ధమే! గెలిస్తే తమకు కాశ్మీర్ దక్కేస్తుందన్నట్టు పాకీలు, ఓడితే తల ఎలా ఎత్తుకోవాలి అన్నట్టు ఇండియన్స్ ఈ గే్మ్ ని కసిగా ఆడేస్తారు. అంతే భీకరంగా రెండు దేశాల జనం కూడా టీవీల ముందు కూర్చుంటారు. కాని, దేశభక్తి, తొక్కా, తోటకూర లాంటివేం లేకుండా బెట్టింగ్ బాబులు మాత్రం ఇదే సమయంలో పందాలు కాస్తుంటారు. ఈసారి ఇండియా, పాక్ మ్యాచ్ సంద్భంగా జరుగుతోన్న పందాల సంగతులు వింటే ఎవరైనా నోరు వెల్లబెట్టాల్సిందే! ఒకటి రెండు కాదు ఏకంగా రెండు వేల కోట్ల రూపాయల బెట్టింగ్ ఇంటర్నెట్ ద్వారా జరుగుతోందట! అంటే, అన్ని వేల కోట్ల రూపాయలు మ్యాచ్ ఫలితాన్ని బట్టి చేతులు మారనున్నాయన్నమాట!

 

పాక్ పై ఇండియా ట్రాక్ రికార్డ్ ఆధారంగా పందెం వేసే వాళ్లు చాలా మంది ఇండియా గెలుస్తుందనే బెట్టింగ్ చేస్తున్నారట. అలా బెట్టింగ్ చేసిన ప్రతీ వంద రూపాయలకి 147రూపాయలు తిరిగొస్తాయి ఇండియా గెలిస్తే. కాని, ఓడితే… పాకిస్తాన్ గెలుస్తుందని రిస్కీ బెట్టింగ్ చేసిన పందెం వీరులకి 300రూపాయలు వస్తాయట! ఇలా వేల కోట్ల రూపాయలు ఇండియా, పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ పైన ఇంటర్నెట్ లో పందాలు కాస్తున్నారట!

 

ఇండియా, పాకిస్తాన్ లలో మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో మనకు తెలియదు కాని… బెట్టింగ్ బాబులు కుమ్మరిస్తోన్న డబ్బులు మాత్రం షాకింగ్ గానే అనిపిస్తాయి! అసలు మొత్తం సంవత్సరం పొడవునా ఇండియా ఆడే క్రికెట్ మ్యాచ్ లపై ఈ ఇంటర్నెట్ పందెం వీరులు కాసే డబ్బెంతో తెలుసా? అక్షరాల రెండు లక్షల కోట్లట! అంటే… ఆఫ్రికా లాంటి ఖండంలో ఒక పేద దేశమేదైనా తన సంవత్సర బడ్జెట్ వేసుకోవచ్చు ఈ బెట్టింగ్ మొత్తంతో! అందుకే, ఇండియాలో క్రికెట్ ని గేమ్ కాదు రిలీజియన్ అంటారు మరి…