TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్పైడర్ మ్యాన్ సృష్టికర్త ఇక లేరు

Published on: Sat Jul 7, 2018 4:19PM

 

స్పైడర్ మ్యాన్.. ఈ పాత్ర పిల్లలకు చాలా ఇష్టం.. పెద్దవారికి కూడా బాగా పరిచయం.. మరి అంతలా ముద్ర వేసిన ఈ స్పైడర్ మ్యాన్ పాత్రకి ప్రాణం పోసింది ఎవరో తెలుసా?.. తెలీదు కదా.. మనం తెలుసుకునేలోపు ఆయన ప్రాణాలే విడిచిపోయారు.. స్పైడర్ మ్యాన్‌ను సృష్టించింది స్టీవ్ డిట్‌కో అనే ఆర్టిస్ట్.. 1961లో ఒక కామిక్ కోసం డిట్కో తన స్నేహితుడు స్టాన్‌లీతో కలిసి, క్రియేటివిటీని ఉపయోగించి స్పైడర్ మ్యాన్‌ను సృష్టించారు.. ఈ కార్టూన్‌ను తమ కామిక్స్‌లో పబ్లిష్ చేయగానే విపరీతమైన క్రేజ్ వచ్చింది.. కామిక్ సూపర్ హిట్ అయ్యింది.. భారీ లాభాలు తీసుకొచ్చి పెట్టింది. అదే కార్టూన్‌ వినియోగించి సినిమాలు సైతం దర్శనమిచ్చాయి.. అలా మనకి స్పైడర్ మ్యాన్ పరిచయం అయింది.. స్పైడర్ మ్యాన్ సృష్టికర్త డిట్‌కో ఈ నెల 29 న ఆయన అపార్టుమెంట్లో మృతిచెందినట్టు తెలుస్తోంది.. ఆయన వయస్సు 90 సంవత్సరాలు..  స్పైడర్ మ్యాన్ కి ప్రాణం పోసిన డిట్‌కో గురించి ఆయన ప్రాణం పోయాక తెలుసుకున్నాం.. కానీ ఒక్కటి మాత్రం నిజం స్పైడర్ మ్యాన్ బ్రతికున్నంత కాలం ఆయన బ్రతికే ఉంటారు.