TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చరిత్ర సృష్టించాం.. కడప మహానాడుపై తెలుగుదేశం నేతలు

Published on: Fri May 30, 2025 12:50PM

కడపలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు తో చరిత్ర సృష్టించామని  ఆ పార్టీ సీనియర్ నేతలు అన్నారు. మూడు రోజుల పాటు కడప వేదికగా జరిగిన మహానాడు విజయవంతమైన నేపథ్యంలో శుక్రవారం (మే 30) తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు సవిత, రాంప్రసాద్ రెడ్డి,  ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు, పుత్తా చేతన్య రెడ్డి, మాధవి రెడ్డి , ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి,  తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి,   జగన్మోహన్ రాజు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తదితరులు కడపలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుపై విశ్వాసం, నమ్మకంతోనూ రాష్ట్రం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో తరలివచ్చారని వారు చెప్పారు.  కడప వైఎస్ జగన్ అడ్డా అన్న అపోహ ఈ మహానాడుతో తొలగిపోయిందనని వారు అన్నారు.  కడపలో తెలుగుదేశం మహానాడు ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కావడం వైఎస్ కుటుంబానికి చెంప పెట్టు లాంటిదని  పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు కడపలో నిర్వహించేందుకు అవకాశం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మహానాడు వేదికపై నుంచి ముఖ్యమంత్రి ప్రకటించిన కడప ఉక్కు పరిశ్రమ , సాగునీటి ప్రాజెక్టులు ఇంకా  ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ,వచ్చే ఎన్నికల నాటికి ఇవన్నీ  పూర్తి చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు, మంత్రులు,నేతలందరికీ  కృతజ్ఞతలు తెలిపారు.