ఇరాన్ విమానం కూలి 39 మంది మృతి
Published on: Mon Aug 11, 2014 12:43PM
.jpg)
విమానాలు కూలిపోయే సీజన్ కొనసాగుతూనే వుంది. ఇప్పుడు మరో విమాన దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 36 మంది మరణించారు. ఇరాన్ రాజధాని టెహరాన్ నుంచి తబస్ నగరానికి వెళ్తోన్న ఓ విమానం రోడ్డుపై కూలిపోవడంతో 39 మంది మరణించారు. ఒకరు మాత్రం ప్రాణాలతో బయటపడి తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయం నుంచి 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన సెఫాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆంటోనోవ్ ఏఎన్-140 విమానం నగర శివార్లలో వందలాది మిలటరీ కుటుంబాలు ఉంటున్న ప్రదేశానికి సమీపంలో రోడ్డుపై కూలిపోయింది. ఈ విమానం అందరూ చూస్తుండగానే రోడ్డుపక్కన ఓ గోడను, చెట్లను ఢీకొట్టి విమానం పేలిపోయిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. రద్దీగా ఉండే ఓ మార్కెట్‌కు 500 మీటర్ల దూరంలోనే ఈ సంఘటన జరిగింది. ఒకవేళ ఆ మార్కె్ట్ మీద విమానం కూలినట్టయితే జననష్టం భారీగా వుండేదని అధికారులు చెబుతున్నారు.


