సీపీఎం రాఘవులు ఉచిత సలహాలు!

 

సీపీఎం నాయకులు అధికారంలో వున్నవారికి ఉచిత సలహాలు ఇవ్వడంలో చాలా ముందుంటారు. సీపీఎం నాయకుడు రాఘవులు తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకి కొన్ని ఉచిత సలహాలు ఇచ్చారు.. కొన్ని విమర్శలు చేశారు. ఆ వివరాలు ఇవి...

 

1. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అలా కురిపించట్లేదేంటి?

 

2. వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్న తపన అటు చంద్రబాబుకు, ఇటు కేసీఆర్‌కి కనిపించడం లేదు. ఇద్దరూ వివాదాలు కొనసాగాలనే కోరుకుంటున్నారు.

 

3. రుణమాఫీ చేస్తానని చంద్రబాబు, కేసీఆర్ చెప్పింది ఓట్ల కోసమే తప్ప రైతులకు మేలు చేయాలని కాదు.

 

4. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఫీజు రీ ఎంబర్స్‌మెంట్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కృష్ణాజలాల విడుదల వంటివి వివాదాలుగా మారాయి.

 

5. 1956 ముందు ఉన్న వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందనడం సరికాదు.