TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గాయపడిన సీపీఐ నారాయణ.. వైసీపీ ఎంపీ చికిత్స 

Published on: Tue Nov 23, 2021 7:02PM

ప్రజా పోరాటాల్లో తనదైన శైలిలో దూసుకుపోతే సీపీఐ  కార్యదర్శి నారాయణ.. అనంతపురం జిల్లాలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. అయితే వరద ప్రాంతాల్లో తిరుగుతున్న సమయంలో కాలు జారి కింద పడ్డారు నారాయణ. ఆయన కాలు బెణకడంతో కొంత ఇబ్బంది పడ్డారు. దీంతో తిరుపతి వైసీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి ఆయన చికిత్స చేశారు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న నారాయణ కాలికి గాయం అవ్వడంతో అక్కడకు చేరుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రాధమిక చికిత్స చేశారు. 

రామచంద్రాపురం మండలం కుప్పంబాదూరుకు చేరుకున్న నారయాణ రాయల చెరువు కట్టను పరిశీలించేందుకు కొండను ఎక్కారు. కొండ దిగే సమయంలో నారాయణ జారి పడ్డారు. కాలు బెణకడంతో నారాయణ అక్కడే కూర్చుండి పోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ అదే ప్రాంతానికి వైసీపీ నేతలు పర్యటనకు వచ్చారు. మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, నారాయణస్వామి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి వచ్చారు. అక్కడే కూర్చుని ఉన్న నారాయణను పలకరించి విషయం తెలుసుకున్నారు. వెంటనే డాక్టర్ అయిన గురుమూర్తి నారాయణకు ఫిజియోథెరపీ చేశారు. కట్టు కట్టారు. తర్వాత వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి తన వాహనంలో నారాయణను ఆసుపత్రికి తీసుకెళ్లారు.