TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ కళ్యాణ్ ఎక్స్‌ట్రా ప్లేయర్‌..

Published on: Fri Sep 4, 2015 3:03PM



సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఏపీ ప్రత్యేక హోదాపై అటు ఏపీ అధికార పార్టీని.. ప్రతిపక్ష పార్టీని విమర్శించారు. కర్నూలులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలంటే ఇరు పార్టీలు భయపడుతున్నాయని.. పార్టీ నేతలకు పంచెలు తడుస్తున్నాయని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో కరువు జిల్లాలను వెంటనే గుర్తించాలని.. భూసేకరణ పేరుతో పేదలనుండి భూములను లాక్కోవడం సరికాదని ఆయన అన్నారు అంతేకాదు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిల్లో పవన్ కళ్యాణ్ ఎక్స్‌ట్రా ప్లేయర్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.