గోరక్షలకు ప్రధాని మోడీ వార్నింగ్

గో రక్షణ పేరిట దాడులకు పాల్పడుతూ సంఘ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్న వారికి ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో గో రక్షక దాడులపై అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గో రక్షణ పేరిట చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని రాష్ట్రాలకు సూచించారు..భక్తి పేరిట తోటి ప్రజలపై దాడులు, కొట్టి చంపడాలు ఏ మాత్రం ఆమోదనీయం కాదని..ఇలాంటి చర్యలను మహాత్మాగాంధీ ఎంత మాత్రం ఆమోదించేవారు కాదు..మనది అహింసకు పుట్టిల్లైన నేల అని ఎందుకు మరచిపోతున్నాం అంటూ మోడీ ఆవేదన వ్యక్తం చేశారు.