ఆవుపాలతో షుగర్‌కు చెక్ చెప్పవచ్చు
Published on: Thu Jul 5, 2012 12:11PM
మూపురం ఉన్న ఆవుకు ప్రత్యేకమైన దాణా ఇవ్వటంద్వారా మధుమేహానికి చెక్ పెట్టవచ్చంటున్నారు తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన డాక్టర్ ఎం సాయి బుచ్చేశ్వరరావు. ఈయన హైదరాబాదులోని అంతర్జాతీయ ఉష్టమండల వ్యవసాయపరిశోధనా సంస్థలో ( (ఐసిఆర్‌ఐయస్‌ఎటి ) లో పనిచేస్తున్నారు. తాపేశ్వరంలోని శ్రీభక్తాంజనేయ స్వీటు షాపు, శ్రీభక్తాంజనేయ గోశాల యజమాని వీరికి సహకరిస్తున్నారు.
మూపురం కలిగిన ఆవుకు 50 గ్రాముల ప్రాకృతిక మందును, 100 గ్రాముల బెల్లం, 100 గ్రాముల తవుడును తడిపి ముద్దగా చేసి ఒకరోజంతా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి ఆవుకు సాధారణ దాణాతోబాటు రోజుకు ఒక సారి అందించామన్నారు. వారం రోజుల దాణా తర్వాత పాలను తీసి మధుమేహ వ్యాదిగ్రస్తులకు ఇస్తామని బుచ్చేశ్వరరావు తెలిపారు. మొదటివిడత ప్రయోగాన్ని మెదక్‌జల్లా సంగారెడ్డిలోని పవర్‌సిస్టం ఎక్విప్‌మెంట్ కంపెనీ జనరల్ మేనేజర్ గా పని చేసిన కృష్ణంరాజు తనదగ్గరవున్న గిర్ జాతి ఆవులకు ఈ ప్రత్యేక దాణా అందించటం ద్వారా ప్రత్యేక పాలను తయారు చేసానని ఎం సాయి బుచ్చేశ్వరరావు తెలిపారు. వారు ఆపాలను కృష్ణంరాజుకి మరి ఇద్దరు వాలంటీర్లకు అందించారన్నారు. అయితే ఈ పాలతో పాటు వారు తీసుకోవలసిన మందులను కూడా తీసుకోవాలని వారు తెలిపారు.
20 రోజుల తర్వాత వారి షుగర్ లెవల్స్‌ని పరీక్షించి వారు వాడుతున్న మందులను తగ్గిస్తామని బుచ్చేశ్వరరావు చెప్పారు. షుగర్ లెవెల్స్ నార్మల్ లెవల్ కి వచ్చిన తర్వాత మందులు వాడాల్సిన పని ఉండదని ఆయన చెప్పారు. రెండవ విడత ప్రయోగానికి శ్రీభక్తాంజనేయ గోశాల యజమాని సలాది శ్రీనివాసరావు వీరికి సహకరింస్తున్నారు. శ్రీభక్తాంజనేయ గోశాలలోని ఒంగోలు జాతి ఆవులను వారు ఈ ప్రయోగానికి ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతే కాక ఈప్రయోగం కోసం ఎంపిక చేసిన 20 మంది షుగర్ వ్యాదిగ్రస్తులకు రోజూ పావులీటరు పాలు, పావులీటరు పెరుగు ఉచితంగా ఇస్తామని సలాది చెప్పారు.


