TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొవిడ్ టీకా తీసుకుంటేనే రేషన్, పెన్షన్.. 

Published on: Tue Oct 26, 2021 11:50AM

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషనే కీలకం కావడంతో.. అందరికి టీకా అందిచండమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్‌ వేసుకోని వారిపై చర్యలు తీసుకునేందు సిద్ధమైంది. రాష్ట్రంలో ఎవరైనా కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకపోతే.. వారి రేషన్‌ మరియు పింఛన్‌ కట్‌ చేస్తామని హెచ్చరించింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస రావు కీలక ప్రకటన చేశారు. 

కొత్త నిబంధనలు నవంబర్‌ 1 వ తేదీ నుంచే అమలు చేస్తామని  శ్రీనివాస రావు స్పష్టం చేశారు. హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస రావు. కరోనా మూడో వేవ్‌ ను అరికట్టేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల 3 కోట్ల వ్యాక్సిన్ మైలురాయిని క్రాస్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 179 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. ఇద్దరు కరోనా సోకి మరణించారు. అలాగే.. 104 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.