మేడారం పూజారికి కరోనా..

తెలంగాణాలో జరిగే మేడారం జాతరను మినీ కుంభమేళాతో పోలుస్తారు పెద్దలు. ఇక్కడ జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా.. పక్కనున్న ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర నుండి భారీగా భక్తులు తరలి వస్తుంటారు. అటువంటి మేడారంలో చిన్న జాతర జరుగుతున్న సమయంలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ముగ్గురు దేవాదాయ శాఖ సిబ్బందికి కరోనా సోకినట్లు‌గా తేలింది. అంతేకాకుండా ఆ సిబ్బందితో సన్నిహితంగా మెలిగిన వారిలో కూడా పలువురికి కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

 

దీంతో కరోనా లక్షణాలు ఉన్నవారిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. అయితే కరోనా నేపథ్యంలో అధికారులు ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా చిన్న జాతరలో భాగంగా భక్తులు రెండో రోజు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుంటున్నారు. మరోపక్క మహా జాతరకు వచ్చినట్లే ప్రస్తుతం జరుగుతున్న చిన్న జాతరకు కూడా వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి, గద్దెలపై ఉన్న సమ్మక్క సారలమ్మను భక్తులు దర్శించుకుంటున్నారు.ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్న దేవాదాయ శాఖ సిబ్బందికి కరోనా పాజిటివ్ తేలడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని వారు అదిత్క్రులను కోరుతూన్నారు