ఛీ.. మనిషా..? రాక్షసా..?
Published on: Thu Jun 17, 2021 11:09AM
మనుషుల్లో మానవత్వం కరువైంది. ఒక వైపు ప్రజలు కరోనా తో ఆస్తులతో పాటు ప్రాణాలను కోల్పోతున్నారు. మరోవైపు హాస్పిటల్ లో వైద్యం తీసుకుంటున్న పేషేంట్లను కూడా వదల కూడా వాళ్ళ వంటి మీద నగలు దొంగతనం చేసిన సంఘటనలు చాలా చూశాం.. అయినా దొంగల బుద్ది ఎక్కడ పోతుంది చెప్పండి.. బంగారు సింహాసనం మీద కుక్క ను కూర్చోపెడితే చివరికి కుక్క బిడ్డి చూపించినట్లు.. దొంగ ఎక్కడ ఉన్న దొంగతనం చేయకుండా ఉంటాడా చెప్పండి. వాళ్ళు దొంగలు దొంగతనం చేయాలి అనుకోవాలి గానీ ఎవర్ని వదలరు. అది కోట్లకు పరుగెత్తిన వాడినైనా కూటికి లేని వాడినైనా సరే.. దొంగల చేయి పడితే దోచేయాల్సిందే తాజాగా ఓ ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో దారుణాతి దారుణం చోటు చేసుకుంది. కోవిడ్ పేషెంట్ వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌పై కన్ను వేసింది.. ఆ తర్వాత చేయివేసింది ఆ ఆస్పత్రి ఉద్యోగిణి.. ఆ తర్వాత పేషెంట్‌ను చంపేసింది. అయితే, తన భార్య కనిపించడం లేదంటూ భర్త చేసిన ఫిర్యాదు అసలు విషయం అంతా బయటపడింది. మే 23వ తేదీన ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తాలూకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నైకి చెందిన సునితకు కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆమె స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్ అయింది. సునీత భర్త మౌళి అమెకు అవసరమైన మందులు భోజనం అందిస్తూ వచ్చాడు. అయితే, సునీత వద్ద కొంత నగదు, సెల్ ఫోన్ ఉన్నాయి. వాటిని కన్ను వేసింది ఆసుప్రతిలో కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగిని రతీదేవి. ఎలాగైనా వాటిని కాజేయాలని ప్లాన్ వేసుకున్న రతీదేవి.. మే 23వ తేదీన రతీదేవి.. కోవిడ్ పేషెంట్ సునీతను అత్యంత దారుణంగా చంపేసింది. ఆమె వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్ తీసుకుని.. సునీత మృతదేహాన్ని ఆస్పత్రి వెనుకవైపు పడేసింది. ఒక రకంగా కరోనా చంపేసిన మనుషులకంటే ఇలా నగల కోసం, డబ్బుల కోసం జనాలను
చంపేసిన సంఘటనలే ఎక్కువగా ఉన్నాయి.
అయితే, సునీత భర్త మౌళి తన భార్య ఆస్పత్రిలో కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రి మొత్తం గాలించారు. అయినా ఎక్కడా కనిపిపంచలేదు. చివరకు ఇవాళ ఆస్పత్రి వెనుకవైపు సునీత మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. క్లూస్ ఆధారంగా విచారణ చేపట్టి హత్య చేసింది రతీదేవి అని తేల్చారు. రతీదేవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెల్లడించింది. సునీత వద్ద ఉన్న నగదు, సెల్ ఫోన్ కాజేసేందుకే హత్య చేసినట్లు రతీదేవి అంగీకరించింది. రతీదేవిని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు ఇవాళ హాజరుపరుచనున్నారు.


