TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పోలీస్‌స్టేషన్‌లో కరోనా.. జైళ్ల‌లో కలకలం.. రోజుకు ల‌క్ష.. హైకోర్టు సీరియ‌స్‌..

Published on: Mon Jan 17, 2022 12:12PM

ఇప్పుడంతా కొవిడ్ కేసుల‌దే మెయిన్ టాపిక్‌. దేశ వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లో అనేక అప్‌డేట్స్‌. ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌డం లేదు వైర‌స్‌. తాజాగా, పోలీసుల‌నూ చుట్టేస్తోంది. ఖాకీలలో కొవిడ్ వ్యాపిస్తోందంటే.. థ‌ర్డ్‌వేవ్ విజృంభిస్తున్న‌ట్టే అంటున్నారు. ఇక క‌రోనా టెస్టులు పెంచాలంటూ తెలంగాణ హైకోర్టు సీరియ‌స్ అవ‌డం.. బ‌ల‌వంతంగా వ్యాక్సిన్ వేయ‌లేమంటూ కేంద్రం స్ప‌ష్టం చేయ‌డం లేటెస్ట్ అప్‌డేట్స్‌. 

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కొవిడ్‌ కేసుల కలకలం రేగింది. పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న 12 మంది పోలీసులకు కరోనా నిర్ధారణ అయింది. యాదగిరిగుట్ట ఏసీపీ, సీఐ, మరో 10 మంది కానిస్టేబుళ్లు కరోనా బారినపడ్డారు. వీరంతా హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. 

అటు, ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఆర్‌టీ-పీసీఆర్‌, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా కోర్టుకు ఇవ్వాలని.. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. 

మ‌రోవైపు, దేశ రాజధాని ఢిల్లీ జైళ్లలో కొవిడ్‌ వ్యాప్తి తీవ్రమవుతోంది. నగరంలోని వివిధ జైళ్లలో ఇప్పటివరకు 90 మందికిపైగా ఖైదీలు, 80 మందికిపైగా అధికారులకు కరోనా సోకినట్టు తేలింది. ఢిల్లీలోని జైళ్లలోనే 50-100 పడకల మెడికల్‌ సెంటర్లను జైళ్ల శాఖ ఏర్పాటు చేస్తోంది. కొవిడ్‌ సోకిన ఖైదీలకు జైళ్ల‌లోనే చికిత్స అందిస్తున్నారు. 

ఇక‌, కొవిడ్‌ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఒక వ్యక్తి సమ్మతి లేకుండా కొవిడ్‌ టీకా వేయాలని సూచించడం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బలవంతంగా టీకా ఇవ్వడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. ఎలాంటి సేవలు పొందడానికైనా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేస్తూ ఇప్పటి వరకు మార్గదర్శకాలేమీ జారీ చేయలేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.