మహమ్మారి మళ్లీ వచ్చింది.. ఇంకో వేవ్ తప్పదా?.. తస్మాత్ జాగ్రత్త
Published on: Thu Apr 7, 2022 11:30AM
అవును. పోయింది అనుకున్న కరోనా మహమ్మరి మళ్ళీ వచ్చింది. ఎక్కడో చైనాలోనో, యూరప్ దేశాలలోనో కాదు, కొవిడ్ కొత్త వేరియంట్, మన గడప లోకి వచ్చేసింది.అవును. ఇంతవరకు,యూరప్‌లో కనిపించిన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఇండియాకు వచ్చింది.దేశ ఆర్థిక రాజధాని ముంబై చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒమిక్రాన్ ఎక్స్ఈ తొలి కేసు నమోదైంది.ఇప్పటికే మూడు వేవ్’లు ఆరు వేరియంట్లుగా ప్రపంచాన్ని చుట్టివచ్చిన, కరోనా, కొత్త వేరియంట్, ఒమిక్రాన్ ఎక్స్ఈ రూపంలో నాలుగో వేవ్ తలుపులు తడుతోంది. దీంతో, కరోనా మహమ్మరి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజల్లో ఇప్పుడు మళ్లీ కలవరం మొదలైంది. రాదనుకున్న, రాకూడదు అనుకున్న ఫోర్త్ వేవ్ వచ్చినట్లే అనుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరికలు జారీ చేస్తోంది.
అయితే, ఈ కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది. కానీ, అంట ప్రమాదకరం కాకపోవచ్చని శాస్త్రవేత్తలు ఓ చిన్న భరోసా ఇస్తునారు.అదే సమయంలో, మరీ అంతగా భరోసా వద్దని హెచ్చరిస్తున్నారు.ఒమిక్రాన్ ఎక్స్‌ఈ ప్రభావం అందరిలో ఒకేలా ఉండదు.కొందరిలో స్వల్పంగా ఉంటుంది. మరికొందరిలో తీవ్రంగా ఉంటుంది.
ఇక ఈ కొత్త వేరియంట్ లక్షణాల విషయానికి వస్తే, ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్’లలో కనిపించిన కరోనా కామన్ కామన్ లక్షణాలు: జ్వరం, గొంతు నొప్పి, గొంతులో గరగర, దగ్గు, జలుబు, చర్మంపై దద్దర్లు, రంగు మారడం, జీర్ణకోశ సమస్యలు వంటి లక్షణాలే ప్రధానంగా కనిపించనున్నాయి. అలసట, కళ్లు తిరగడం వంటివి ప్రారంభంలో కనిపించే కొన్ని లక్షణాలు. తలనొప్పి, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, జ్వరం వంటి తర్వాత కనించే లక్షణాలు. గుండె దడ, గుండె జబ్బులు, తీవ్రమైన నరాల వ్యాధులు వంటి తీవ్రమైన లక్షణాలు కూడా ఈ వేరియంట్ వల్ల కలగవచ్చని అంటున్నారు.అయితే, వాసన, రుచి కోల్పోవడం మాత్రం ఈ వేరియంట్ అంతగా కనిపించడం లేదు. థర్డ్ వేవ్’లో వచ్చిన ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్ కన్నా ఇండి పది శాతం వేగంగా విస్తరిస్తుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.అయితే, ఇంతకూ ముందే అనుకున్న విధంగా, ఈ వేరియంట్ అంతగా ప్రాణాంతకం కాదు, కానీ, ఉపేక్షించేంత బలహీనం కాదు. అందుకే, భయం వద్దు నిర్లక్షమూ వద్దని శాస్త్రవేత్తలు, వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మొదటి నుంచి అనుసరిస్తున్నా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని అంటున్నారు. అలాగే.బూస్టర్ డోసు సహా వాక్సిన్ తీసుకోవడం, పిల్లలకు వాక్సిన్ ఇప్పించడం ముఖ్యమని అంటున్నారు.


