TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొవిడ్ ఫోర్త్‌వేవ్‌ డేట్‌ ఫిక్స్‌!.. ఎప్ప‌టినుంచి ఎప్ప‌టి వ‌ర‌కంటే...

Published on: Mon Feb 28, 2022 3:45PM

ఇప్పుడు క‌రోనా పేరే వినిపించ‌డం లేదు. కొవిడ్ భ‌య‌మే క‌నిపించ‌డం లేదు. అంతా బిందాస్‌. థ‌ర్డ్‌వేవ్ ముగియ‌డంతో అంతా వ‌ర్రీ వ‌దిలేశారు. అయితే.. ఫ‌స్ట్‌, సెకండ్‌, థ‌ర్డ్ లానే.. ఫోర్త్ వేవ్ కూడా ఉంటుంద‌నే విష‌యాన్ని మ‌రిచిన‌ట్టున్నారు. ఒక‌వేళ గుర్తున్నా.. ఆ.. వ‌చ్చిన‌ప్పుడు చూసుకుందాంలే.. అని ధీమాగా ఉన్నారు. థ‌ర్డ్‌వేవ్ ఇలా వ‌చ్చి.. తుస్సు మ‌ని.. అలా వెళ్లిపోవ‌డం.. జ‌న‌మంతా ఇప్ప‌టికే టీకాలు తీసుకొని ఉండ‌టంతో.. క‌రోనా అంటే భ‌యం పోయింది. కానీ, మ‌నం తీసుకున్న టీకాల ర‌క్ష‌ణ సామ‌ర్థ్యం కేవ‌లం 8 నెల‌లు మాత్ర‌మేన‌నే విష‌యం చాలామందికి తెలీక‌పోవ‌చ్చు. రెండు డోసుల టీకా తీసుకున్నా.. 8 నెల‌ల త‌ర్వాత అది కొవిడ్ నుంచి మ‌న‌ల్ని కాపాడ‌లేదు. అందుకే, బూస్టర్ డోస్ ఇచ్చేది. వృద్ధుల‌కు మిన‌హా మిగ‌తా వ‌ర్గాల‌కు ప్ర‌స్తుతం బూస్ట‌ర్ డోస్ అందుబాటులో లేదు. మ‌న‌లో చాలామంది వ్యాక్సిన్ తీసుకొని.. 8 నెల‌లు దాటేసింది. మ‌రి, ఇలాంటి స‌మ‌యంలో ఫోర్త్‌వేవ్ వ‌స్తే...? త‌ట్టుకోగ‌ల‌మా? థ‌ర్డ్‌వేవ్‌లో వ‌చ్చిన ఒమిక్రాన్ చాలా వీక్ కాబ‌ట్టి స‌రిపోయింది.. ఆ వైర‌స్ మ‌ళ్లీ బ‌లం పుంజుకొని.. కొత్త వేరియంట్ రూపంలో మ‌న‌పై దాడి చేస్తే ఏంటి ప‌రిస్థితి..? మ‌న‌మెంత సేఫ్‌..? ఇంత‌కీ ఫోర్త్‌వేవ్ వ‌స్తుందా..? వ‌స్తే, ఎప్పటినుంచి వ‌స్తుంది..?

జూన్ నుంచి దేశంలో ఫోర్త్‌వేవ్ మొదలయ్యే ఛాన్స్ ఉందంటున్నాయి అధ్యయనాలు. ఐఐటీ-కాన్పూర్ నిపుణుల అధ్యయనం ప్రకారం దేశంలో వచ్చే జూన్ మధ్య నుంచి కరోనా ఫోర్త్‌వేవ్ ప్రారంభమవుతుందట. ఈసారి రాబోయే కొత్తవేవ్ గత మూడు వేవ్‌లకంటే మరింత ఎక్కువ కాలం ఉండొచ్చంటున్నారు.

ఫోర్త్‌వేవ్‌ జూన్ 22న మొదలవుతుంద‌ని లెక్క‌లేస్తున్నారు. దాదాపు 4 నెలల పాటు ఉంటుందని అంచ‌నా వేస్తున్నారు. అయితే, ఫోర్త్‌వేవ్ ఉధృతి అనేది.. కొత్త వేరియెంట్ల సామ‌ర్థ్యం, వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్‌లపై ఆధారపడి ఉంటుంద‌ని చెబుతున్నారు. 

ఇండియాలో జనవరి 30, 2020న మొదటి కరోనా కేసు నమోదైంది. వాళ్ల‌ లెక్క ప్ర‌కారం.. మొద‌టి కేసు వ‌చ్చిన 936 రోజులకు.. అంటే ఈ జూన్ 22 నుంచి కొవిడ్ ఫోర్త్‌వేవ్ మొదలయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఐఐటీ-కాన్పూర్ ఎక్స్‌ప‌ర్ట్స్‌. ఆగష్టు 23 కల్లా కేసుల సంఖ్య పీక్స్‌కు చేరుకుంటుందని.. అక్టోబర్ 24కల్లా ఫోర్త్‌వేవ్ అంతమవుతుందని.. లెక్క‌లేసి చెబుతున్నారు. 

ప్రస్తుత అంచనా ప్రకారం కొత్త వేరియెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. వైరస్ వ్యాప్తి, తీవ్రత వంటి అంశాలపై ఫోర్త్‌వేవ్ ప్రభావం ఆధారపడి ఉంటుందంటున్నారు. ఒమిక్రాన్‌లా బ‌ల‌హీన వేరియంట్ వ‌స్తే ఓకే.. అదే డెల్టా వేరియంట్‌లా బ‌ల‌మైన వైర‌స్ దాడి చేస్తే మాత్రం ప్ర‌మాద‌మే. ఆలోగా బూస్ట‌ర్ డోస్ కంప్లీట్ చేస్తే.. ఎంతోకొంత సేఫ్‌.