ఉదయం తొమ్మిదింటికే కోర్టు.. కాబోయే సుప్రీం సి.జె సూచన
Published on: Fri Jul 15, 2022 2:29PM
అన్నింటికీ సమయ పాలన అవసరం. సమయానుకూలంగా ఇంటి పనులు అవుతున్నపుడు ప్రభుత్వ కార్యాలయాలు అలానే ఎందుకు జరగడం లేదు.. ఇది చాలాకాలం నుంచి చాలామందికి వున్న పెద్ద అనుమానం. ప్రభుత్వ కార్యాలయం అనగానే ప్రత్యేకించి గడియారాన్ని పట్టించుకోరు. అనాదిగా అదో బద్ధకపు పద్ధతి అలవాటయింది.
పిల్లల బడి ఉదయాన్నే ఏడుగంటలకో, ఎనిమిది గంటలకో ఖచ్చితంగా ఆరంభమవుతుంది. అలాంట పుడు కోర్టులు కూడా ఎందుకు అలా కాస్తంత ఉదయాన్నే కార్యకలాపాలు ఆరంభించకూడదు? ఈ ప్రశ్న వచ్చింది మరెవరికో కాదు ఆగస్టులో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కానున్న జస్టిస్ యు.యు. లలిత్‌కి వచ్చింది.
మామూలుగా కోర్టు కార్యకలాపాలు ఉదయం పదిన్నరకి ఆరంభమవుతాయి. కానీ శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నరకే సుప్రీం కోర్టు కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. అదీ ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ కార్యకలాపాలు ఆరంభించడంతో. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జస్టిస్ లలిత్ ఒక సూచన చేశా రు. అదేమంటే పిల్లల స్కూలు ఉదయం ఏడింటికే ఆరంభమవుతున్నపుడు న్యాయమూర్తులు, న్యాయ వాదులూ కోర్టుకి ఉదయం తొమ్మిది గంటలకే రాలేరా? అని అన్నారు. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగీ ఈ సూచన విని హర్షం వ్యక్తం చేశారు. మరి లలిత్ ప్రధాన న్యాయమూర్తిగా పదవిని అలంకరించ గానే తమ ఆలోచనను అమలుచేస్తారనే అనుకోవాలి.


