జనసేన ఎమ్మెల్యే అరెస్ట్.. పోలీసులకు కోర్టు అక్షింతలు

 

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు ఊరట లభించింది. నాన్‌ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంపై కోర్టు పోలీసులకు అక్షింతలు వేసింది. పోలీస్‌స్టేషన్‌పై దాడి కేసులో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసి..  రాజోలు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోవడానికి వచ్చిన ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. అయితే ఎమ్మెల్యే రాపాక పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీంతో స్టేషన్ బెయిల్‌పై రాపాక విడుదలయ్యారు.