TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

అర్థరాత్రి ఏఎన్నార్, దాసరి, హరికృష్ణ విగ్రహాల తొలగింపు

Published on: Tue May 14, 2019 10:42AM

 

విశాఖపట్నంలోని బీచ్‌ రోడ్డులో సినీ ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణ విగ్రహాలను జీవీఎంసీ అధికారులు తొలగించారు. అనుమతి లేకుండా ఈ విగ్రహాలు ఏర్పాటు చేశారని పేర్కొంటూ నిన్న అర్ధరాత్రి విగ్రహాలను తరలించారు. వీఎంసీ జోన్ 2 ఏసీపీ నాయుడు ఆధ్వర్యంలో ఈ విగ్రహాలను తొలగించారు. బీచ్‌ రోడ్డులో విగ్రహాల ఏర్పాటుపై నిషేధం ఉంది. అదీగాక.. విశాఖపట్నానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలను తెచ్చి సమస్యలు సృష్టించాలని చూస్తున్నారని జనసేన నేత బొలిశేట్టి సత్యనారాయణ గతంలో కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆ విగ్రహాలను తొలగించాలని ఆదేశించింది. ఈక్రమంలో స్పందించిన జీవీఎంసీ అధికారులు వాటిని తొలగించారు. గతంలో ఈ విగ్రహాలను యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఏర్పాటు చేయగా.. వాటిని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. బీచ్‌రోడ్డులో విగ్రహాల ఏర్పాటుపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.