TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అఘోరీకి లింగ నిర్థారణ పరీక్ష.. కోర్టు ఆదేశం!

Published on: Wed Apr 23, 2025 5:48PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీకి చేవెళ్ల కోర్టు బుధవారం (ఏప్రిల్ 23) 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఘోరీ తరఫు లాయర్ చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అఘోరీది చీటింగ్ కేసు కావడంతో.. కోర్టు ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చెప్పలేమన్నారు. బెయిల్ ఎప్పుడు వస్తుందో  కూడా చెప్పలే మన్నారు. చీటింగ్ కేసు రుజువైతే అఘోరీకి పదేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అఘోరీ తరఫున వాదించిన న్యాయవాదే అహోరికి శిక్షపడే అవకాశం ఉందనడం ఆసక్తిగా మారింది.   

ఇలా ఉండగా కోర్టు ఆదేశాల మేరకు అఘోరీకి పోలీసులు బుధవారం (ఏప్రిల్ 23) లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.  అఘోరీకి పోలీసులు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు కంది సెంట్రల్ జైలుకు తరలించారు. కానీ జైలు అధికారులు లింగ నిర్ధారణ కాకుండా జైలులో ఉంచుకోలేమని తేల్చి చెప్పడంతో పోలీసులు అఘోరీని తిరిగి కోర్టుకు తీసుకువెళ్లారు. దీంతో కోర్టు అఘోరీకి లింగ నిర్ధారణ పరీక్షకు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు అఘోరీకి లింగ నిర్ధారణ పరీక్స చేయించారు.