మల్లికా షెరావత్కి కోర్టు నోటీసులు
Published on: Mon Aug 4, 2014 3:04PM
.jpg)
'డర్టీ పాలిటిక్స్' సినిమాలో జాతీయ జెండాను అవమానపరిచారని దాఖలైన పిటిషన్పై బాలీవుడ్ నటి మల్లికా షెరావత్కు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో చిత్ర నిర్మాతతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. డర్టీ పాలిటిక్స్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లో జాతీయ పతాకాన్ని అవమానిచే విధంగా ధరించినందుకు మానవ హక్కుల కార్యకర్త ధన్గోపాలరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. మల్లికా షెరావత్పై చర్య తీసుకోవాల్సిందిగా కోర్టుకు పిర్యాదు చేసారు. అలాగే సినిమా ఫస్ట్లుక్లో మల్లిక షెరావత్ ఒక కారుపై అభ్యంతరకరంగా త్రివర్ణ పతాకాన్ని ధరించి ఉన్నట్లుగా రూపొందించారు. కాగా ఇదే వివాదంపై రాజస్థాన్ లోనూ కేసు నమోదు అయ్యింది.


