TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రి శంకర్రావును అరెస్ట్ చేయాలి

Published on: Sat Dec 17, 2011 1:08PM

హైదరాబాద్: భూముల ఆక్రమణ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు మంత్రి శంకర్రావును అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ బషీర్‌బాగ్‌లోని బాబుజగ్జీవన్‌ రామ్‌ విగ్రహం వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యర్తలు శనివారం ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ కన్వీనర్‌ ఆదం విజయ్‌కుమార్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి, నాంపల్లి పీఎస్‌కు తరలించారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మంత్రి శంకర్రావు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వెల్లాల రామ్మెహన్ ను పోలీసులు అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. రామ్మోహన్ను విడుదల చేయాలంటూ పీఎస్ ఎదుట పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.