కొడుకును అమ్మీ కారును తీసుకుని..
Published on: Sat May 15, 2021 9:16AM
అందరికి కి సొంత ఇల్లు కట్టుకోవాలి. సొంత కారు కొనుకోవాలి అనే డ్రీమ్స్ ఉంటాయి. చాలా మంది కష్టపడి తమ డ్రీమ్స్ ని సాదించాలనుకుంటారు. కానీ కొందరు అయితే ఏం పని చేయకుండానే అవన్నీ కావాలని అనుకుంటారు. ఒక అతనికి సొంతంగా కారు కొనుకోవాలని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అందరి వస్తుంది అందులో ఏముంది అని అనుకుంటున్నారా ? అలా అనుకుంటే మీరు కరోనా మీద కాలు వేసినట్లే ఎందుకంటే. ఎవరైనా కొత్త కారు తీసుకోవాలంటే వాళ్ళు సంవత్సరాల తరబడి దాచుకున్న డబ్బులతో తీసుకుంటారు. లేదంటే బంగారు అమ్మి తీసుకుంటారు అది కూడా ఒకే సారి అంత డబ్బు లేకపోతే కారు లోనే తీసుకుని కారు తీసుకుంటారు. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడో మీరే చూడండి.
యూపీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కారు కొనేందుకు ఓ జంట తమ కన్నపేగునే అమ్మకానికి పెట్టిన హృదయ విదారక ఘటన కన్నౌజ్ జిల్లా తిర్వా కొట్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ పసికందు అమ్మమ్మ, తాతయ్య గురువారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సతౌర్‌కి చెందిన ఓ మహిళ మూడు నెలల క్రితం మగ శిశువుకి జన్మనిచ్చింది. అయితే, కారు కొనుగోలు చేసేందుకు గురుసాహైగంజ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు తన కుమార్తె, అల్లుడు కలిసి పసివాడిని రూ.1.5లక్షలకు విక్రయించినట్టు ఆ మహిళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆ శిశువు ఇప్పటికీ వ్యాపారి వద్దే ఉన్నాడని ఇన్‌స్పెక్టర్ శైలేంద్ర కుమార్ మిశ్రా తెలిపారు. శిశువును అమ్మకానికి పెట్టిన ఆ దంపతులను విచారణ కోసం పిలిచినట్టు ఆయన వెల్లడించారు. ఇటీవలే ఆ దంపతులు పాత కారును కొనుగోలు చేసినట్టు గుర్తించామన్నారు.


