భర్తే డాక్టర్.. బిడ్డకు బంపర్ ఆఫర్.!!

స్త్రీ బిడ్డకు జన్మనివ్వడం గొప్ప వరంగా భావిస్తోంది.. బిడ్డ జననం భర్త చేతుల మీదుగా జరిగితే స్త్రీకి అంతకంటే అదృష్టం ఉండదేమో.. తాజాగా అలాంటి సంఘటనే అమెరికాలో జరిగింది.. మ్యాగీ అనే ఆమెకి నెలలు నిండి డెలివరీ సమయం దగ్గరపడటంతో ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళదామని భర్త రాబర్ట్ అతని ఇద్దరి కూతుళ్లను కూడా కారులో ఎక్కించుకున్నాడు.. దారి మధ్యలో తన స్నేహితుడి ఇంట్లో ఇద్దరి కూతుళ్లను డ్రాప్ చేసి, ఆ తర్వాత మ్యాగీని హాస్పిటల్‌కు తీసుకెళుదామనుకున్నాడు.

 

 

తన స్నేహితుడికి చిక్ ఫిల్ ఏ రెస్టారెంటు దగ్గరకు రమ్మనాడు.. స్నేహితుడు వచ్చి రాబర్ట్ కూతుళ్లను తీసుకెళ్లాడు.. తను అలా కూతుళ్లను తీసుకెళ్లగానే మ్యాగీకి నొప్పులు మొదలయ్యాయి.. అప్పటికే రాత్రి 10 గంటలు కావడంతో రెస్టారెంట్ మూసేసే సమయం అయ్యింది.. వెంటనే తనను వాష్ రూంకు తీసుకెళ్లాల్సిందిగా మ్యాగీ కోరింది.. దీంతో రెస్టారెంట్ తలుపును కొట్టగా అందులో సిబ్బంది తలుపులు తెరిచారు.. వెంటనే మ్యాగీని వాష్‌రూంకు తీసుకెళ్లారు.. అయితే అక్కడే నొప్పులు తీవ్రతరం అయ్యాయి.. ఇక మ్యాగీని అక్కడి నుంచి తరలించలేనని గ్రహించిన రాబర్ట్.. బిడ్డ తల్లి గర్భం నుంచి బయటకు రావడం చూసి వెంటనే రంగంలోకి దిగాడు.

 

 

బిడ్డ మెడకు పేగులు చుట్టుకోవడంతో మెల్లగా వాటిని తొలగించాడు.. అలానే అంబులెన్స్‌కు కబురు పెట్టమని మేనేజర్‌కు చెప్పాడు.. అంబులెన్స్ దారి మధ్యలో ఉండగా అందులోని డాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, డాక్టర్ చెప్పినట్లుగా ఫాలో అయి బిడ్డను జాగ్రత్తగా డెలివరీ చేసాడు.. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండటంతో రాబర్ట్ ఆనందంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.. మరోవైపు తమ రెస్టారెంట్‌లో బిడ్డకు జన్మనిచ్చినందున ఆ హోటల్ యాజమాన్యం రాబర్ట్ బిడ్డకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.. జీవితకాలం బిడ్డకు తమ హోటల్‌లో ఉచితంగా భోజనం వసతి కల్పించడంతో పాటు ఉద్యోగం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చింది.