TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు షురూ

Published on: Mon Mar 3, 2025 8:40AM

ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు గత నెల 27న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల  ఓట్ల లెక్కింపు సోమవారం (మార్చి 3) ఉదయం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో  ఒక టీచర్, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు, అలాగే తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ స్థానాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.  

తెలంగాణలో  కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ, పట్టభద్రుల  నియోజ కవర్గాలకు అలాగే వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కృష్ణ, గుంటూరు.. ఉభయగోదావరి జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్యెల్సీ స్థానాలకు, ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. వీటి కౌంటింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది.