TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బిక్షపతికి బి.సి.ఓట్లు పడతాయా?

Published on: Fri May 18, 2012 2:44PM

పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టి.ఆర్.ఎస్. అభ్యర్థిగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి భిక్షపతి పేరును ప్రకటించింది. నియోజకవర్గంలో 50 శాతం ఉన్న బిసి ఓట్లకు గేలం వేసేందు కు టి.ఆర్.ఎస్. ఆఖరి నిమిషంలో అభ్యర్థిని మార్చిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా సాంబారి సమ్మారావు, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ, టి.ఆర్.ఎస్. అభ్యర్థిగా మోలుగూరి భిక్షపతి పోటీలో ఉన్నారు.

 

 

తెలంగాణా పొలిటికల్ జెఎసి మద్దతు తమకు లభించగలదని టి.ఆర్.ఎస్. పొలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నరసింహారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నియోజకవర్గ ఇన్ ఛార్జిలకు టిక్కెట్టు ఇచ్చే టి.ఆర్.ఎస్. సాంప్రదాయం కూడా కొనసాగింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి సాంబారి సమ్మారావు, టి.ఆర్.ఎస్. అభ్యర్థి భిక్షపతి బిసి ఓట్లను పంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరికీ ఇతరుల ఓట్లు ఎక్కువ లభిస్తే వారు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థి, తాజామాజీ కొండాసురేఖటి పోటీపడతారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

 

2009 ఎన్నికలను పరిశీలిస్తే 13వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిగా కొండాసురేఖ విజయం సాధించారు. అప్పుడు కూడా టి.ఆర్.ఎస్. అభ్యర్థి భిక్షపతి ఈమెతో పోటీపడ్డారు. సురేఖకు 69,135, భిక్షపతికి 5,335 ఓట్లు వచ్చాయి. ఈసారి ఏమైనా సరే పరకాల ఎమ్మెల్యేగా తాను అసెంబ్లీలో కాలుమోపాలను కుంటున్నానని భిక్షపతి టి.ఆర్.ఎస్. కార్యకర్తలతో అంటున్నారు. వారు కూడా గదేముందిలే అన్నా ఈసారి నీవేనే ఎమ్మెల్యే అని భరోసా ఇస్తున్నారు. పేరు ప్రకటించిన నిమిషం నుంచి భిక్షపతి కార్యకర్తల భరోసా కోరటం టి.ఆర్.ఎస్. నేతలకు ఆనందాన్నిచ్చింది.