బాబు హయాంలో స్కామ్.. డ్రైఫ్రూట్స్ ఖర్చు 18 లక్షలా!!
Published on: Mon Jun 3, 2019 2:58PM

ఏపీలో సీఎం జగన్ నిర్వహిస్తున్న సమీక్షల్లో గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో చోటు చేసుకున్న పలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆర్ధికశాఖలో జరిగిన వేల కోట్ల అక్రమ కేటాయింపులపై ఓవైపు చర్చ జరుగుతుండగానే ఏపీ ఉన్నత విద్యామండలిలో జరిగిన మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఏపీ ఉన్నత విద్యామండలిలో కేవలం నలుగురు అధికారులకు డ్రైఫ్రూట్స్ కోసం గత మూడేళ్లలో 18 లక్షల రూపాయలు ఖర్చుపెట్టినట్లు తాజాగా తేలింది. ఈ విషయాన్ని అధికారులు ఇవాళ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
గత మూడేళ్లలో ఉన్నత విద్యామండలిలో నలుగురు ఉన్నతాధికారుల కోసం తెప్పించిన డ్రైఫ్రూట్స్ ఖర్చు అక్షరాలా 18 లక్షల రూపాయలని తాజాగా అధికారుల పరిశీలనలో తేలింది. గత పాలకుల అండదండలతోనే ఈ వ్యవహారం సాగిందని గుర్తించారు. అయితే ఈ మొత్తం అధికారిక కార్యక్రమాల సందర్భంగా వాడిన డ్రైఫ్రూట్స్ కు ఖర్చు చేశారా లేక సొంత అవసరాల కోసం వాడుకున్నారా అనేది తేలాల్సి ఉంది.


