మరోసారి గాలి, శ్రీనివాస్‌ల కు చుక్కెదురు
Published on: Tue Jan 31, 2012 4:12PM
హై
దరాబాద్ : గాలి అక్రమ మైనింగ్ వ్యవహారంలో కీలక నిందితులుగా ఉన్న కర్నాకట మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డి, ఓఎంసీ ఎండీ శ్రీనివాస్‌రెడ్డిలకు సీబీఐ కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. వారి బెయిల్ పిటీషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు మరోసారి కొట్టేసింది. ఇప్పటి వరకు వారు బెయిల్ కోసం నాలుగు సార్లు సీబీఐ కోర్టులో పిటీషన్ పెట్టుకున్నారు. వారి పిటీషన్‌ను కోర్టు నాలుగు సార్లు కొట్టివేసింది. దీంతో వారు డీలా పడ్డారు.


