TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అవినీతి బాబులకు ఇక గుబులే!

Published on: Wed Feb 15, 2012 9:31AM

న్యూఢిల్లీ: అవినీతి కార్యకలాపాలకు పాల్పడిన ప్రభుత్వ అధికారులు ఉద్యోగ విరమణ తర్వాత కూడా వారి ఆస్తులను లేదా ధనాన్ని స్వాధీనం చేసుకోవడానికి వీలుగా కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖను సంప్రదించాక ఈ గైడ్‌లైన్స్ రూపొందించారు. వీటి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి రిటైరయిన తర్వాత కూడా అతను అవినీతి కార్యకలాపాల ద్వారా సంపాదించిన ఆస్తులను లేదా సంపదను జప్తు చేయడానికి సంబంధిత డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారి కేంద్రానికి అధికారం ఇస్తారు. అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలను ఎదుర్కొంటున్న లేదా చార్జిషీటు పెండింగ్‌లో ఉండగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైరయితే వారి ఆస్తులను జప్తుచేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబిఐ పేర్కొన్న నేపథ్యంలో ఈ కొత్త గైడ్‌లైన్స్ జారీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అవినీతి అధికారుల ఆస్తులను జప్తుచేసే విషయంలో వివరణలు కోరుతూ చాలా విభాగాలు తమకు లేఖలు రాస్తున్నాయని, రిటైరయిన ప్రభుత్వ అధికారుల విషయంలో మరిన్ని ఇబ్బందులు ఉంటున్నాయని, అందువల్ల సమస్యను పరిష్కరించాలని తాము నిర్ణయించామని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. దీనికోసం నిర్దేశిత గైడ్‌లైన్స్‌ను సిబిఐ సహా అన్ని ప్రభుత్వ విభాగాలకు పంపించినట్టు ఆయన చెప్పారు.