50 నిమిషాల్లోనే కరోనాను నిర్ధారించవచ్చు!

కేవ‌లం నిమిషాల వ్యవధిలోనే కరోనా వైరస్ ను గుర్తించే స్మార్ట్ ఫోన్ ఆధారిత పోర్టబుల్ కిట్ ను యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా రూపొందించింది.  గొంతు నుంచి సేకరించిన నమూనాతో ఈ కిట్ ద్వారా 50 నిమిషాల్లోనే కరోనాను నిర్ధారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కిట్ ద్వారా ఒకేసారి 16 నమూనాలను పరీక్షించే వీలుందని పరిశోధకులు తెలిపారు. తమకు వైరస్ సోకిందో - లేదో తెలుసుకోవడం పాటు తమ ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా చేయడానికి ఈ కిట్ ఉపయోగపడుతుందని వివరించారు. 

గొంతు నుంచి సేకరించిన నమూనా నుంచి 3 నిమిషాల్లోనే ఆర్ ఎన్ ఏను వెలికితీసి కరోనా నిర్థారిత పరీక్షలు చేయ‌వ‌చ్చు.  తక్కువ నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది కూడా ఈ కిట్ ను ఉపయోగించేలా రూపొందించిన‌ట్లు పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన జస్టిన్ ఓ గ్రాడీ తెలిపారు.  ఈ కిట్ ను నేషనల్ హెల్త్ సర్వీస్ రెండు వారాల పాటు పరీక్ష చేయనుంది.  

ప్రస్తుతం ల్యాబ్ పరీక్షల ద్వారా కోవిడ్ నిర్ధారణకు 24 నుంచి 48 గంటల సమయం పడుతుంది.