TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీకాళహస్తి లో వైర‌స్ ఇలా పాకింది!

Published on: Sat Apr 25, 2020 12:33PM

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి వాసుల్నిక‌రోనా చెమ‌ట‌లుప‌ట్టిస్తోంది. ప్రముఖ శైవక్షేత్రంగా విరసిల్లే ఈ ఊరు ఇప్పుడు కరోనా భయంతో చిగురుటాకులా వణికిపోతోంది. మరింత దారుణమైన విషయం ఏమంటే.. కరోనా బాధితుల్లో ఏకంగా పదిహేడు మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం. చిత్తూరు జిల్లాలో 73 పాజిటివ్ కేసుల్లో యాభైకు పైనే ఒక్క శ్రీకాళహస్తి పట్టణంలో నమోదు కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. 

మార్చి 18న లండన్ నుంచి శ్రీకాళహస్తికి వచ్చాడో యువకుడు. కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వెళ్లగా.. అతనికి వైరస్ సోకిన వైనాన్ని మార్చి 25న గుర్తించారు. అప్పటికే అతను కుటుంబ సభ్యులు.. బంధువులతో గడిపాడు. ఊరి చివర ఉన్న దాబాలకు వెళ్లాడు. సదరు యువకుడికి పాజిటివ్ అని తేలిన వెంటనే.. అతడి కుటుంబ సభ్యుల్ని మాత్రమే క్వారంటైన్ కు తరలించారు.

అంతే తప్పించి.. అతడు ఎవరెవరిని కలిశాడు? ఎక్కడెక్కడకు వెళ్లాడన్న విషయాన్ని ఆరా తీసి.. వారందరిని క్వారంటైన్ కు తరలించి ఉంటే.. మూలంలోనే ముగిసి పోయేది. కానీ.. అధికారులు ఇక్కడో పెద్ద తప్పు చేశారు. పాజిటివ్ గా తేలిన వ్యక్తి కాంటాక్టు అయిన వారందరిని వదిలేశారు. దీనికి ఫలితంగా అతడు కాంటాక్టు అయిన వారిలో నలుగురికి.. అతని స్నేహితుడికి పాజిటివ్ గా తేలింది. ఈ సందర్భం లో అయినా.. ఈ ఐదు కేసులతో సంబంధం ఉన్న వారిని.. వారు కాంటాక్టు అయిన వారిని గుర్తించి ఉంటే బాగుండేది. కానీ.. ఆ సందర్భంలోనూ అధికారులు స్పందించింది లేదు. ఇది రెండో తప్పు.

ఇలాంటి వేళలోనే మర్కజ్ లింకు ఊరికి వచ్చింది. శ్రీకాళహస్తి నుంచి ఢిల్లీ సమావేశాలకు వెళ్లిన 13 మంది ఊరికి తిరిగి వచ్చారు. కేంద్ర నిఘా విభాగం హెచ్చరించే వరకూ వారిని గుర్తించే విషయంలో అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. దీంతో వారిని గుర్తించే విషయంలో ఆలస్యం చోటు చేసుకోవటంతో పాటు.. రిజర్వేషన్ లేకుండా వచ్చిన కొందరిని గుర్తించే విషయంలోనూ అధికారులు ఫెయిల్ అయ్యారు.

ఢిల్లీకి వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించటంతో అతన్ని క్వారంటైన్ కు తరలించారు. అతడితో పాటు అతడి భార్యను కూడా పంపారే కానీ పిల్లల్ని వదిలేశారు. బ్యాడ్ లక్ ఏమంటే.. అధికారులు విస్మరించిన పిల్లల్లో ఒకరికి పాజిటివ్ రావటం.. అతడి కారణంగా పలువురికి పాజిటివ్ గా తేలింది. ప్రైమరీ నుంచి కాంటాక్టులకు అంటుకోవటం.. సెకండరీ కాంటాక్టును గుర్తించే విషయంలో జరిగిన పొరపాట్లు ఈ రోజున శ్రీకాళహస్తి పట్టణం ప్రమాదపు అంచుల వరకూ చేరే పరిస్థితికి కారణమైంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో స్థానిక అధికారుల నిర్లక్ష్యం.. తప్పులే ప్రజలకు శాపంగా మారింది.