భారత్‌లో లక్ష దాటిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు
Published on: Tue May 19, 2020 10:11AM
భారత్‌లో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 1,01,139కి చేరింది. గత 24 గంటల్లో భారత్‌లో 134 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,163కి చేరింది. దేశంలో ప్రస్తుతం 58,802 యాక్టివ్ కేసులు ఉండగా.. 39,173 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.


