TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈ దేశాల‌పై కరోనా వైర‌స్ దాడి చేయ‌లేద‌ట‌!

Published on: Wed Apr 15, 2020 9:49AM

కరోనా వైరస్ రిసోర్స్ సెంటర్ కు చెందిన జాన్ హాప్ కిన్స్ యూనివర్శిటీ తన వెబ్ సైబ్ లో ఈ విష‌యాల‌ను వెల్లడించింది. ఇప్పటివరకు ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాని దేశాల జాబితాను జాన్ హాప్ కిన్స్ ప్ర‌క‌టించింది.

1. కొమొరోస్ 2. లెసోతో 3. మార్షల్ దీవులు 4. పలావు 5. నౌరు 6. సమోవ 7.కిరిబాటి 8. వనౌటు 9. సోలమన్ దీవులు 10. టోన్గా 11. టువాలు 12. తుర్క్మెనిస్తాన్ 13. తజికిస్తాన్.

ఇదిలా వుంటే తమ దేశంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఉత్తర కొరియా చెబుతోంది. అయితే ఆ దేశం మాటను ఎవరూ నమ్మడం లేదు. కరోనా కేసులు నమోదైనా రహాస్యంగా ఉంచి తమ దేశంలో కరోనా పాకలేదని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ ప్రకటిస్తున్నాడు. అయితే అలాంటిదేమీ లేదని.. చైనా పక్కన ఉన్న ఆ దేశంలో తప్పనిసరిగా కేసులు నమోదయ్యాయని కానీ ఉద్దేశపూర్వకంగా ప్రకటించడం లేదని అంతర్జాతీయ సంస్థలు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విల‌య‌తాండ‌వం. ఏడు ఖండాలకు ఈ వైరస్ పాకింది. అగ్ర దేశాలతో పాటు అట్టడుగున ఉన్న దేశాలకు కూడా ఆ వైరస్ కలవరం సృష్టిస్తోంది. ప్రపంచమంతా ఆ వైరస్ అంత కల్లోలం సృష్టిస్తుండగా ఇలాంటి సమయంలో కూడా కొన్ని దేశాల్లో కరోనా వైరస్ వ్యాపించలేదు.