ఎమ్మెల్యేలు సుచరిత, ఆళ్లకు కరోనా
Published on: Sat Jul 2, 2022 12:11PM
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. తెలుగు రాష్ట్రాలలో కూడా కోవిడ్ వ్యాప్తి నెమ్మది నెమ్మదిగా తన కోరాలు చాస్తోంది. అధికార వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తాజాగా కరోనా బారిన పడ్డారు. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. దీంతో ఇరువురూ ఇసోసేషన్ లోకి వెళ్లి పోయారు. ఇటీవలి కాలంలో తమతో బేటీ అయిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉందన్న ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే తెలంగాణ సర్కార్ కరోనా ప్రొటోకాల్ పాటించడం తప్పని సరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలనీ, మాస్కులు తప్పని సరిగా ధరించాలని పేర్కొంది. అలాగే లక్షణాలున్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవడంతో పాటు.. హోం ఇసోలేషన్ లో ఉండాలని స్పష్టం చేస్తున్నది.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో దాదాపు 500 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 27,130 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు ఏపీలో కూడా కరోనా కోరలు చాస్తోందని ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కోవిడ్ సోకడంతో స్పష్టమౌతున్నది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ కూడా అప్రమత్తమైంది. కరోనా పరీక్షల సంఖ్యను పెంచింది.


