TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముంబైలో మళ్లీ మహమ్మారి విజృంభణ.. 6శాతానికి చేరిన కరోనా పాజిటివిటీ రేటు

Published on: Thu Jun 2, 2022 6:08AM

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు సాచింది. ప్రస్తుతం 6శాతం పాజిటివిటీ రేటుతో వేగంగా విస్తరిస్తోంది. కరోనా మొదటి, రెండో దశలలో ముంబైలో ఎంతటి మారణ హోమం సృష్టించిందో తెలిసిందే. చాలా వరకూ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయి నందున ఈ సారి కరోనా వ్యప్తి వల్ల ప్రాణ నష్టం ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయినా ముందు జాగ్రత్త చర్యలుగా ముంబైలో కరోనా పరీక్షల సంఖ్యను ప్రభుత్వం పెంచింది.

అలాగే అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ బూస్టర్ డోస్  ఇచ్చేందుకు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇక 12 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రస్తుత వ్యాప్తి వేగం చూస్తుంటే ముంబైలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఆందోళన వ్యక్తం చేస్తన్నది. మంగళవారం ఒక్క రోజే ముంబైలో 506 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఫిబ్రవరి తరువాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ముంబైలో గత నెలలో నమోదైన కరోనా కేసులతో పోలిస్తే మేలో 100 శాతం అధికంగా నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు.  కరోనా వ్యాప్తి తీవ్రత దృష్ట్యా ఆసుపత్రిలో కరోనా చికిత్సలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని బీఎంసీ ప్రభుత్వాన్ని కోరింది.

ఆక్సిజన్ సిలిండర్లు, ఐసోలేషన్ సెంటర్లు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంటి. ముంబైలో కరోనా ఆంక్షల అమలుపై ప్రభుత్వం యోచిస్తోంది. ఏది ఏమైనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.