TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తరుముకొస్తున్న భూతం.. ఫోర్త్ వేవ్‌!

Published on: Mon Jun 6, 2022 12:53PM

క‌నిపించ‌ని క్రిమి జీవితాల్ని తారుమారుచేసింది. ల‌క్ష‌ల‌మంది చ‌నిపోయారు. ల‌క్ష‌ల కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయి. ఒక్క‌సారిగా ప్ర‌పంచ దేశాలు, ప్ర‌భుత్వాలు ప్ర‌జాసంక్షేమం, ప్ర‌జ‌ల ఆరోగ్యం విష‌యంలో  ఏ మేర‌కు ప‌నిచేస్తున్నామ‌న్న‌ది స‌రిచూసుకోవ‌ల‌సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దేవుడు శ‌పించాడ‌ని కొంద‌రు, శాస్త్ర‌వేత్త ల‌కు అంద‌ని రాక్ష‌సి అని ఇంకొంద‌రు తిట్టిపోసి ప్రార్ధ‌న‌లు, య‌జ్ఞాలు చేసేరు. దేశంలోని యావ‌త్ ఆరోగ్య శాఖా త‌మ బాధ్య‌త‌ను గొప్ప‌గా నిర్వ‌హించి క‌రోనా నుంచి తేరుకునే వీలు క‌ల్పించింది.

దేశ విదేశాల మం దులు, ఇంజ‌క్ష‌న్‌లూ ర‌క్ష‌ణ క‌వ‌చంగా నిలిచి ప్రాణం నిల‌బెట్టాయి. అంద‌రం ఆ మూడు వేవ్‌ల నుంచి బ‌యటప‌డ్డాం. అన్ని దేశాల‌వారికంటే మ‌నం బ‌హుత్ అచ్చా కియా అని దేశంలోని యావ‌త్ డాక్ట‌ర్ల‌ను, పారిశుధ్య కార్మికుల‌నూ నోరారా ప్ర‌శంసించారు ప్ర‌ధాని, అన్ని రాష్ట్రాల సీఎంలూ, మం త్రులు, అధికారులు.   అంత‌టితో బ‌య‌ట‌ప‌డ్డామ‌ని హ‌మ్మ‌య్య ఇక బ‌య‌ట తిర‌గొచ్చ‌ని, మ‌ళ్లీ అంద‌రూ బ్యాగ్‌లు స‌ర్దుకున్నారు.

దేశంలో చాలా ప్రాంతాల్లో, ఇక్క‌డ మ‌న ప‌ట్ట‌ణాలూ, గ్రామాల్లో సైతం జ‌నం రోడ్ల మీద‌కి విప‌రీతంగా వ‌చ్చే శారు. త‌మ స్నేహితులు, బంధువుల‌ను క‌లిసేందుకు ఊళ్ల‌కీ తిరిగేయడం ఆరంభమ‌యింది. కొద్ది నెల‌లు ముఖానికి మాస్క్ పెట్టుకోవ‌డం కొన‌సాగించి త‌ర్వాత మెల్ల‌గా అదీ తీసే సేరు. ఇప్పుడంగా బాగానే వుంద‌ని సిని మాలు, షికార్లు కూడా మొద‌లెట్టేరు. సినిమా షూటింగ్‌లు, పెళ్లిళ్ల సంద‌డీ, బాగా జ‌నాల్ని ఆహ్వానిం చ‌డం   జ‌రుగుతోంది. దాదాపు మూడేళ్ల త‌ర్వాత వ‌చ్చిన ఇంత‌టి స్వేచ్ఛ‌ని ఎవ‌రు మాత్రం వ‌దులుకుం టారు.

అంద‌రూ అన్నీ చేస్తున్నారు. ఆఫీసులు, ఇత‌ర ప‌నులు చేసేసుకుంటున్నారు. మ‌ళ్లీ  క‌రోనా  రాకూ డ‌ద‌ని ఇంట్లో పూజ‌లు ఇంకా కొన‌సాగుతూనే వున్నాయి. రానే రాద‌ని ప్ర‌భుత్వం ధీమా వ్య‌క్తం చేస్తూ ఆరోగ్య సూత్రాలు త‌ప్ప‌కండా  పాటిస్తుండండి  అంటూ యాడ్స్ గుప్పించ‌డం ప‌రిపాటి అయింది.
ఆమ‌ధ్య ఎపుడో మ‌ళ్లీ మ‌రో విడ‌త వుండ‌వ‌చ్చ‌న్న అనుమానాలు ప్ర‌చార‌మ‌య్యాయి. అది తేలిగ్గానే తీసు కున్నారు. కానీ నాలుగో వేవ్ నిజ‌మేన‌ని ఇటీవ‌ల స్ప‌ష్ట‌మ‌యింది.

దేశంలో వివిధ రాష్ట్రాల్లో నాలుగో వేవ్ బారిని ప‌డిన‌వారి సంఖ్య పెరుగుతోంది. అప్పుడే 4275 కేసులు న‌మోద‌యినట్టు వార్త‌లు వింటూంటే  మ‌ళ్లీ భ‌యాందోళ‌న‌లు పెరిగిపోయాయి. అయ్యో దేవుడా ఈమ‌ధ్య‌నేగా కాస్తంత ఊపిరిపీల్చుకుంటున్న‌ది, పిల్ల లు దైర్యంగా స్కూళ్ల‌కీ వెళుతున్న‌దీ అనుకుంటూ త‌లిదండ్రులు దిగులుప‌డుతున్నారు.  ఎందు కంటే ఢిల్లీ, క‌ర్నాట‌క‌, ఇటు  ఆంధ్ర‌, తెలంగాణాలోనూ మెల్ల‌గా కేసులు పెరిగిపోతున్నాయి. మ‌హారాష్ట్ర‌లో  కేసు లు బాగా పెరిగిపోయి ప్ర‌మాద‌ఘంటిక‌లు మోగిస్తున్నాయి.

ఇది తెలంగాణాకూ మ‌రీ ప్ర‌మాద‌మంటున్నారు. అస‌లు దేశంలో క‌రోనా విప‌రీతంగా విస్త‌రించ‌డానికి బొంబాయిలోని ధరావీ  మురికి  ప్రాంత‌మనే ప్ర‌చారం బాగా జ‌రుగుతోంది.  ఇక ఈ నాలుగో వేవ్ గురించి మ‌రింత జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఎంతో వుంది. ఇది వేగంగా విస్త‌రించే అవ‌కాశం వుంద‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  ఫోర్త్ వేవ్ సంబంధించిన కొత్త వేరియంట్ల సంగ‌తీ స‌మాచారం ఇంకా బ‌య‌ట‌ప‌డ‌లేదు. అవి విజృంభించ‌నంత‌వ‌ర‌కూ సేఫ్ అనే అనుకోవాలి. 

ఏమ‌యిన‌ప్ప‌టికీ, మ‌ళ్లీ  ఫిజిక‌ల్ డిస్టెన్స్‌, మొహానికి తొడుగు వేసుకోవ‌డం త‌ప్ప‌కుండా అమ‌లుచేయాలి.  గ‌తంలో క‌రోనా రెండో ద‌శ‌లో అంద‌రం మొహానికి తొడుగు ధ‌రించ‌డం అల‌వాటుచేసుకున్నాం. త‌ర్వాత  ఇంజ‌క్ష‌న్‌ల‌కు సిద్ధ‌ప‌డి బ‌య‌ట‌ప‌డ్డాం. ఇప్పుడు కాస్తంత ముందే ప‌రిస్థితులు తెలిసేయి గ‌నుక ఇప్ప‌టి నుంచే ఆ జాగ్ర‌త్త‌లు పాటించాలి. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు, అధికారులు, డాక్ట‌ర్ల స‌ల‌హాలు,హెచ్చ‌రిక‌లు చేయ‌డానికి ముందే మ‌నం మ‌న జాగ్ర‌త్త‌లు పాటించ‌డం మంచిది. పూర్వానుభ‌వం దృష్ట్యా ఎవ‌రికి వారు క‌నీస జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన స‌మ‌యం మ‌ళ్లీ ఆస‌న్న‌మ‌యింద‌నే అనాలి.