సోనియా గాంధీకి కరోనా .. 8న ఈడీ విచారణకు హాజరయ్యేనా?
Published on: Thu Jun 2, 2022 2:03PM
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి మాణిగం ఠాకూర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిథి రణదీప్ సూర్జేవాలా కూడా సోనియాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని ధృవీకరించారు. కాగా రాజకీయ ప్రత్యర్ధులు మాత్రం ఈడీ విచారణను నుంచి తప్పించుకునేందుకే కరోనా సాకు చెబుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు, ఈడీ విచారణను తప్పించుకునేదుకు కరోనా సాకు చెబుతున్నారా అన్న అనుమానాలను రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తం చేస్తున్నారు.
.webp)
బుధవారం సోనియాకు స్వల్ప జ్వరం సోకిందనీ, దాంతో ముందు జాగ్రత్తగా కోవిడ్ పరీక్ష చేయించుకోగానే పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని రణదీప్ సుర్జేవాలా తెలిపారు. దీంతో సోనియా గాంధీ ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారని వివరించారు. సోనియా ఈ నెల 8న విచారణకు ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. నేషనల్ హెలార్డ్ కేసులో ఈడీ సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 8 నాటికి కరోనా నుంచి సోనియా కోలుకుంటారని భావిస్తున్నారు.


