ఇండియాలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పైనే క‌రోనా ప్రభావం!

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 3113 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 75 మంది ప్రాణాలు కోల్పోయారు. 213 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

మనదేశంలో కరోనాసోకిన కేసుల్లో ఎక్కువగా 21 నుంచి 40 ఏళ్ల లోపు వ‌య‌స్సు వారే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనాసోకిన మొత్తం బాధితుల్లో వీరు 41 శాతం. ఆ తర్వాత 41నుంచి 50 ఏళ్ల‌ మధ్య వయస్సున్నవారు 83 శాతంగా ఉన్నారు.

60 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్నవారు 17శాతం ఉన్నారు. వీరికి కరోనా సోకి తగ్గడం కష్టసాధ్యమైన విషయమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. నావెల్ కరోనావైరస్ మనదేశంలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పై ప్రభావం చూపుతోందని తెలిపింది.

దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ కరోనావైరస్ విస్తరించిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.