ఏపీలో ఒక్కరోజులో 300 కరోనా కేసులు!!
Published on: Thu Jun 18, 2020 1:48PM
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఒక్కరోజులో దాదాపు 300 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 13,923 శాంపిల్స్ ను పరీక్షించగా 299 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో ఇద్దరు కరోనాతో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,854 కి చేరగా, మృతుల సంఖ్య 92కి చేరింది. 24 గంటల్లో 77 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 2,983 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 2,779 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


