ఏపీలో పర్యవేక్షణకు సమన్వయ బృందాలు!

లాక్ డౌన్ పటిష్ట అమలు, నిత్యావసర వస్తువులు సరఫరా,సేవలు పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో సమన్వయ బృందాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రజలకు వివిధ నిత్యావసర సేవలు అందేలా చూడడం ఇందుకు సంబంధించి ఏమైనా సమస్యలు ఫిర్యాదులు ఉంటే రాష్ట్ర స్థాయిలోని 1902 కంట్రోల్ రూమ్ ద్వారా స్వీకరించి వాటిని సత్వరం పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిల్లో సమన్వయ బృందాలను ఏర్పాటు చేస్తూ జిఓఆర్టి సంఖ్య 223 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

ఈసమన్వయ బృందాలు లాక్ డౌన్ సక్రమంగా అమలు అయ్యే లి చూడడంతో పాటు ఆ సమయంలో ప్రజలకు వివిధ నిత్యావసర సేవలు సక్రమంగా అందేలా చూస్తుంది.అంతేగాక వివిధ నిత్యావసర వస్తువులు డిమాండ్ ను ముందుగానే అంచనా వేసి ఆయా నిత్యావసర వస్తువులు కూరగాయలు ఆయా ప్రాంతాలకు సరఫరా జరిగేలా ఈసమన్వయ బృందాలు చూస్తాయి.నిత్యావసర వస్తువులు సేవలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఫిర్యాదులు ఉంటే 1902 కంట్రోల్ రూమ్ ద్వారా స్వీకరించి వాటిని రాష్ట్ర,జిల్లా స్పందన కంట్రోల్ రూమ్లు ద్వారా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని ఆ ఆదేశాలలో పేర్కొన్నారు.

పౌరసరఫరాలు, పోలీస్, డైరీ డెవలప్మెంట్, పశుసంవర్థక,మత్స్య, మున్సిపల్, పంచాయతీరాజ్, కార్మిక తదితర శాఖల అధికారులు రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ కు రోజువారీ నివేదికను (Daily Situation Report)సమర్పించాలని సిఎస్ స్పష్టం చేశారు.

సంబంధిత సమన్వయ బృందం ఓవరాల్ ఇన్చార్జి రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ సమన్వయంతో వివిధ నిత్యావసర సేవలు ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలని ఆదేశించారు.అదే విధంగా జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్లు కూడా రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ తో సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు.
అదేవిధంగా వివిధ నిత్యావసర వస్తువులు తయారీ,రవాణా, సేవలుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే అలాంటి సమస్యలు, ఫిర్యాదులను ఈసమన్వయ బృందాలు తెల్సుకుని రాష్ట్ర, జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ లో ద్వారా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్ర సమన్వయ బృందాలు:
కేంద్ర ప్రభుత్వం,ఇతర రాష్ట్రాలతో  ఓవరాల్ సమన్వయ ఇన్చార్జి  టిఆర్ఆండ్బి ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు ఆయనతోపాటు మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి, మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రద్యుమ్న,ఎ.శ్రీకాంత్, ఎన్ఫోర్స్మెంట్ ఐజి వినీత్ బ్రిజ్ లాల్,ఐజి లీగల్ హరికుమార్ ఉన్నారు.
అలాగే మాన్యుఫాక్చరింగ్ మరియు నిత్యావసర వస్తువులు సమన్వయ బృందం ఇన్చార్జి గా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆయనతోపాటు పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం,కార్మిక శాఖ ప్రత్యేక కమీషనర్ రేఖా రాణి,ఎంపి ఫైబర్ సిఇఓ సుమీత్ ఉన్నారు.

నిత్యావసర వస్తువులు సరఫరా రాష్ట్ర, జిల్లా సమన్వయ ఇన్చార్జి గా  పౌరసరఫరాల శాఖ కమీషనర్ కె.శశిధర్ ఆయనతోపాటు ప్రద్యుమ్న,ఉద్యానవన శాఖ కమీషనర్ చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హెచ్ అరుణ్ కుమార్, మార్క్ ఫెడ్ ఎండి శ్రీ కేష్ లక్తర్,ఆయిల్ ఫెడ్ ఎండి శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.

అదేవిధంగా నిత్యావసర వస్తువులు రవాణా పర్యవేక్షణ కు ఇన్చార్జి గా రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ విసి మరియు ఎండి  వై.భాను ప్రకాశ్ ఆయనతోపాటు రవాణా శాఖ కమీషనర్ పి.సీతారామాంజనేయులు,సిఐడి డిజి డా.సిఎం త్రివిక్రమ్ వర్మ, సర్వే శాఖ డైరెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.
స్థానిక సంస్థల్లో నిత్యావసర వస్తువులు,తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం నిర్వహణ ఇన్చార్జిగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఆయనతో పాటు మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఆశాఖ కమీషనర్ జిఎస్ఆర్కె విజయకుమార్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్,ఎసిబి డిఐజి యం.రవిప్రకాశ్, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు రంజిత్ భాషా ఉన్నారు.

అలాగే స్వచ్చంద సంస్థలు,వాలంటరీ గ్రూపులు,సిఎస్ఆర్ నిధులు సమీకరణ తదితర అంశాలకు ఇన్చార్జి గా సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు కె.హర్షవర్ధన్,బిసి సంక్షేమ శాఖ సంచాలకులు బి.రామారావు,గ్రేహాండ్స్ ఎస్పి రాహుల్ దేవ్ శర్మ ఉన్నారు.

మీడియా మేనేజిమెంట్ ఇన్చార్జి గా సమాచార శాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి,ఎపిటిఎస్ ఎండి నందకిశోర్,డిఐజి ఎస్పి రాజశేఖర్ బాబు ఉన్నారు.