TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పీకుడు పాలిటిక్స్‌.. ఫ్ర‌స్టేష‌న్ పీక్స్‌.. మీరేం పీకారు జ‌గ‌న‌న్న‌!?

Published on: Sat Apr 9, 2022 11:38AM

ఏపీలో ఇప్పుడంతా పీకుడు గురించే చ‌ర్చ‌-ర‌చ్చ‌. నా వెంట్రుక కూడా పీక‌లేరంటూ.. నిండు స‌భ‌లో, విద్యార్థుల ముందు సీఎం జ‌గ‌న్‌రెడ్డి యాక్ష‌న్ చేసి మ‌రీ చూపించ‌డం ఆయ‌న‌లోని ఫ్ర‌స్టేష‌న్‌కు నిద‌ర్శ‌నం అంటున్నారు. భావిభారత పౌరుల ముందు అలాంటి పదజాలం వాడి.. సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారంటూ అంతా మండిపడుతున్నారు. జ‌గ‌న్‌రెడ్డి ఎంత‌గా ఇదైపోతుంటే ఇలాంటి బాష మాట్లాడారో అర్థం చేసుకోవ‌చ్చ‌ని అంటున్నారు. దెయ్యం, మారీచులు, దౌర్భాగ్య ప్రతిపక్షం, దౌర్భాగ్య మీడియా, దౌర్భాగ్య దత్తపుత్రుడు.. విప‌క్ష నేత‌ల‌కు బీపీ, షుగ‌ర్లు, గుండెపోట్లు.. ఇలా ప‌చ్చి బాష మాట్లాడుతూ.. నా వెంట్రుక కూడా పీక‌లేరంటూ నేల‌బారు స్థాయికి దిగ‌జారిపోయారు సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అంటూ తప్పుబడుతున్నారు.  

గ‌తంలో జ‌గ‌న్‌రెడ్డి ఇలాంటి చెత్త మాట‌లు మాట్లాద‌లేద‌నే చెప్పాలి. మ‌రిప్పుడే ఎందుకిలా, అంద‌రిముందూ ఈ బి-గ్రేడ్ లాంగ్వేజ్ యూజ్ చేశార‌నే చ‌ర్చ న‌డుస్తోంది. త‌న వైఫ‌ల్యాల‌ను, ప్ర‌భుత్వ ఫెయిల్యూర్‌ను క‌ప్పిపుచ్చుకోలేక ఇలా బ‌రెస్ట్ అవుతున్నార‌ని అంటున్నారు. జ‌గ‌న్ చేస్తున్న త‌ప్పుల‌ను, ఆయ‌న చేత‌గాని త‌నాన్ని, రాష్ట్రం దివాళ అంచుకు చేర‌డాన్ని.. మీడియా ప‌దే ప‌దే గుర్తు చేస్తుండ‌టంతో ఆయ‌న ఆ ఫ్ర‌స్టేష‌న్ భ‌రించ‌లేక పోతున్నట్టున్న‌ది. అందుకే, దౌర్భాగ్య మీడియా అంటూ అలా ఆవేశం వెల్ల‌గ‌క్కిన‌ట్టున్నార‌ని అంటున్నారు. 

ఇక‌, ఇప్పుడే జ‌గ‌న్‌రెడ్డి ఇంత దారుణ‌మైన బాష మాట్లాడేందుకూ కార‌ణం లేక‌పోలేద‌ని అంటున్నారు. రాష్ట్రంలో గంట‌ల త‌ర‌బ‌డి క‌రెంట్ కోత‌ల‌తో ప్ర‌జ‌లు న‌ర‌కం చూస్తున్నారు. ఆసుప‌త్రుల్లో క‌రెంట్ లేక సెల్‌ఫోన్ వెలుగుల్లో ఆప‌రేష‌న్లు చేస్తున్న దృశ్యాలు చూసి అంతా చ‌లించిపోతున్నారు. ఇదేం దిక్కుమాలిన పాల‌న‌.. చీక‌టి పాల‌న అంటూ జ‌గ‌న‌న్న‌కు అంతా శాప‌నార్థాలు పెడుతున్నారు. స‌మ‌స్య‌ను టీడీపీ సైతం స‌రిగ్గా క్యాచ్ చేసింది. నారా లోకేశ్ లాంత‌ర్లు ప‌ట్టుకొని.. రాత్రి వేళ‌ల్లో గ్రామ ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ.. ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ పాల‌నలో వైఫ‌ల్యాల‌ను బాగా ఎత్తి చూపుతున్నారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌వ‌ర్ హాలిడే ప్ర‌క‌టించి అభివృద్ధిని అంధఃకారంలోకి నెట్టేశారు. సింపుల్ థింగ్‌.. చంద్ర‌బాబు హ‌యాంలో ఒక్క గంట కూడా క‌రెంట్ పోలేదు.. జ‌గ‌న్ ఏలుబ‌డిలో రోజంతా క‌రెంటే ఉండ‌టం లేదు. ఐపాయ్‌. జ‌గ‌న్ ప‌నిత‌నం తెలిసిపాయ్‌. అందుకే, బై బై జ‌గ‌న్ అంటూ ట్విట‌ర్‌లో ట్రెండింగ్ న‌డుస్తోంది. ఇలా విద్యుత్ కోత‌ల‌తో ప్ర‌జ‌ల‌కంటే కూడా జ‌గ‌న్‌రెడ్డినే ఎక్కువ‌గా ఉక్కిరిబిక్కిరి అవుతున్న‌ట్టున్నారు. అందుకే, కంట్రోల్ త‌ప్పుతూ.. ప్ర‌తిప‌క్షం, మీడియాపై పీకుడు బాష వాడుతున్నారు. 

రాజ‌కీయంగానూ జ‌గ‌న్‌రెడ్డికి గుండెద‌డ అమాంతం పెరిగింద‌ని అంటున్నారు. ఇటీవ‌ల జ‌న‌సేనాని ప‌వ‌న్ మాట్లాడుతూ.. ఈసారి ప్ర‌తిప‌క్ష ఓటు చీల్చ‌బోమంటూ స్ప‌ష్టం చేశారు. ప‌రోక్షంగా టీడీపీతో పొత్తుకు ఇండికేష‌న్ ఇచ్చారు. దెబ్బ‌కు జ‌గ‌న‌న్న‌కు గుండెపోటు వ‌చ్చినంత ప‌ని అయిన‌ట్టుంది.. అందుకే, ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు బీపీ, షుగ‌ర్లు, గుండెపోట్లు వ‌స్తాయంటూ శాప‌నార్థాలు పెట్టార‌ని అనుకుంటున్నారు. కొంపదీసి, గుండెపోటు అంటే తమరి బాబాయ్ వివేకాకు వచ్చినటువంటి గుండెపోటు అయితే కాదుగా?

మ‌రోవైపు, మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ త‌ర్వాత వైసీపీలో సంక్షోభం రానున్న‌ట్టు తెలుస్తుండ‌టం కూడా జ‌గ‌న్‌రెడ్డి ఫ్రస్టేష‌న్‌కు కార‌ణం కావొచ్చు అంటున్నారు. జ‌గ‌న్ పీకుడు డైలాగ్‌ను ప్ర‌జ‌ల నుంచి సైతం అంతే రేంజ్‌లో పీకుడు క్వ‌శ్చ‌న్స్ వ‌స్తున్నాయి. విప‌క్షం, మీడియా ఏం పీక‌లేరు స‌రే.. మ‌రి, మూడేళ్లుగా ముఖ్య‌మంత్రిగా ఉంటూ మీరేం పీకారు జ‌గ‌న‌న్న అంటూ సోష‌ల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్ న‌డుస్తోంది. ప్ర‌త్యేక హోదాపై ఏం పీకారు? అమ‌రావ‌తిపై ఏం పీకారు?  పోల‌వ‌రంపై ఏం పీకారు? సీపీఎస్ ర‌ద్దుపై ఏం పీకారు? ఇలా ఏపీలో పీకుడు బాగోతం న‌డుస్తోంది. 

ఇక, నారా లోకేశ్ ట్విట‌ర్‌లో వాయించిన‌ట్టు.. "ప్రజలే మీ వెంట్రుకలు పీకడానికి, గుండు కొట్టించి పిండి బొట్లు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు. అయినా, మీరే  గుండు కొట్టించేసుకోండి.. మీ వెంట్రుక ఎవడు పీకుతాడో చూద్దాం".